కేంద్ర బడ్జెట్ 2019-20 కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జ్ర్త్ నిజంగాన్ర వరాల జల్లే. రైతులు గ్రామీణ ప్రేదలకు అనేక ప్రయోజనాలు ప్రకటించబడ్డాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మౌలికవసతులు కల్పనలో శ్రద్దా సక్తులు కనబరిచారు.


బడ్జెట్‌: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు: నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఉదయం  ట్రేడింగ్‌ ఆరంభంలోనే  సూచీలు లాభా ల్లోకి దూసుకెళ్లాయి. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 36,350 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,851 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెద్దగా మారలేదు. రూ.71.07గా కొనసాగుతోంది.

Image result for piyush modi budget

ఈఎస్‌ఐ పరిమితి రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు

రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు

60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌

గ్రాట్యుటీ పరిమితి 10 లక్షల - 30లక్షలకు పెంపు

గోకుల్‌ మిషన్‌కు రూ.750కోట్లు

రైతులకు ఏడాది రూ.6వేలు

మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు

50కోట్ల మందికి అండగా ఆయుష్మాన్‌ భారత్‌

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాం

ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చాం

Image result for piyush modi budget 

* ఆయుష్మాన్ భారత్‌తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా

* కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం

* హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.

* 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం

* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు 

* గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు

* నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం

* మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు

* ఎల్‌ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం

* రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం

* బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం

* ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి

* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం

* స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు

* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

* ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం

* 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం

* కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం

* మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం

* మా  హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది

* జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి

* మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది

* గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం

* మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.

* 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు

* విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

* దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.

* రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం

* అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం

కేంద్ర బడ్జెట్ 2019-20కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన పార్లమెంట్ హాల్‌లో జరిగిన భేటీలో మంత్రిమండలి బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: