బహుశా మొదటిసారి చంద్రబాబునాయుడు నిరసనగా నల్లచొక్కా దరించారేమో ? కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.  నల్లచొక్కాను ధరించింది చంద్రదబాబే అయినా సిఎంను నల్లచొక్కా ధరించేట్లు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. ప్రత్యేకహోదాతో ఏం వస్తుంది ? హోదా పొందిన రాష్ట్రాల్లో ఏమభివృద్ధి జరిగింది ? అని ప్రశ్నించిన చంద్రబాబే ఇఫుడు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అంటూ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. హోదా కోసం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారంటే అందుకు జగనే కారణమని చెప్పాలి.

 

నిజానికి ఏపిలో ప్రత్యేకహోదా డిమాండ్ ఈ నాటికీ సజీవంగా ఉందంటే అందుకు జగన్ కారణమనే చెప్పాలి. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లోను తిరిగిన జగన్ ప్రత్యేకహోదా వల్ల ఏపికి జరిగే మేలును, రాష్ట్రాభివృద్ధిలో హోదా పాత్ర ఎంత కీలకమో అన్న విషయాలను సదస్సులు, ఆందోళనల ద్వారా అందరికీ వివరించారు. హోదా కోసం జగన్ ఆందోళనలు చేసిన రోజున ఇదే చంద్రబాబు జగన్ ను ఎగతాళి చేస్తు మాట్లాడిన విషయం అందరూ చూసిందే.

 

అటువంటి చంద్రబాబు ఇఫుడు అదే ప్రత్యేకహోదా కోసం స్వయంగా రాష్ట్ర బంద్ చేయిస్తున్నారు. నిజంగా అధికారంలో ఉండి ఆందోళనలు, నిరసనలు, రాష్ట్రబంద్ చేయిస్తున్నారంటే చంద్రబాబు సిగ్గుపడాలి. అయినా అన్నింటినీ వదిలిపెట్టేసి రాష్ట్రబంద్ కు పిలుపిచ్చారంటే ఆ ఘనత జగన్ దే అనటంలో సందేహం అవసరం లేదు.

 

ప్రత్యేకహోదా అంటేనే జైలుకు పంపిస్తానంటూ ఒకపుడు చంద్రబాబు హూంకరించారు. హోదా నిరసనల్లో, ఆందోళనల్లో పిల్లలను పంపవద్దంటూ ఇదే చంద్రబాబు విద్యార్ధుల తల్లి, దండ్రులకు క్లాసు పీకిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటి చంద్రబాబు ఇపుడు ప్రత్యేకహోదాలో పాల్గొన్న వారిపై ఉన్న కేసులను ఎత్తేస్తున్నట్లు చెప్పారంటే జగన్ కాక మరెవరు కారణం ? సరే చంద్రబాబు ఏం చేసినా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే లేండి. గెలుపు కోసమైనా దేనికోసమైనా సరే మొత్తానికి జగన్ చూపించిన బాటలోనే చంద్రబాబు కూడా నడుస్తున్నారా లేదా అన్నదే ముఖ్యమిక్కడ.


మరింత సమాచారం తెలుసుకోండి: