నేటి  ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సామాన్యులు సంతోషపడే ఎన్నో అంశాలు ఇందులో పొందుపర్చారు.  వచ్చే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్’ పథకం కింద అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్లు దాటాక నెలనెలా పెన్షన్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

అయితే ఇందుకు కార్మికులు ప్రతి నెల కనీస మొత్తం కడితే చాలు..అయితే రూ.15000 అంతకన్నా తక్కువ వేతనం పొందే కార్మికులే ఈ పథకానికి పేర్కొన్నారు.  ఈ పథకం ద్వారా లబ్దిదారుడు 60 యేళ్ల వయసులో నెలకు రూ.3000 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ 29 ఏళ్ల వయసులోని వ్యక్తి ఈ పథకంలో చేరితే నెలకు రూ.100 కడితే సరిపోతుందన్నారు. 

ఈ పథం  2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. అంతే కాదు ఈ పథకం కోసం ఇప్పటికే   రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ పథకంతో దాదాపు 10 కోట్ల మంది కార్మికులు, సిబ్బంది లబ్ధి పొందుతారని చెప్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: