ఫిబ్రవరి ఒకటో తారీఖు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఏ ఏ వర్గాలపై కరుణ చూపిస్తారో.. ఏ ఏ వర్గాలపై పన్నుల మోత ఉటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.



దేశంలోని వార్తా ఛానళ్లలోనూ ఒకటే దృశ్యం.. బడ్జెట్ సమర్పిస్తున్న గోయల్ అన్ని ఛానళ్లలోనూ కనిపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. బీజేపీ చేసిన అన్యాయాన్ని కడిగి పారేస్తున్నారు.



రక్తం మరిగిపోతోంది అంటూ ఆవేశపడిపోతున్నారు.. మీకు సిగ్గు కూడా లేదా అని బీజేపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆవేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేసే అవకాశం ఏదీ.. టీడీపీ భక్త ఛానళ్లుగా ముద్రపడ్డ టీవీలు కూడా బడ్జెట్ ఆపేసి చంద్రబాబు లైవ్ ఎలా ఇస్తారు..?

Image result for chandrababu in black dress in assembly


దీంతో చంద్రబాబు ఆవేశం లైవ్ టెలికాస్ట్ కాకుండా పోయింది. ఆయన వీరావేశం ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం ఆంధ్ర ప్రజలు కోల్పోయారు. మంచి పొలిటికల్ మైలేజీని చంద్రబాబు మిస్సయ్యారు. మరి 40 ఏళ్ల సీనియర్ పొలిటీషియన్ కు బడ్జెట్ లైవ్ వస్తుందని.. ఇప్పుడు ఎవరూ లైవ్ ఇవ్వరని తెలీదా.. లేక.. లైవ్ ఇవ్వకపోయినా రేపు మన పత్రికల్లో పతాక శీర్షికల్లో ఇస్తారులే అనుకున్నారా..? ఏమో అది బాబుకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: