నిన్న అధికార పార్టీ బీజేపీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను చూసిన వారికి నవ్వురాక తప్పదు. అప్పటికేదో గొప్ప బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు బీజేపీ ఆరోపించడం అంత కంటే హాస్యాస్పదం ఉండదు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టామని మోడీ సర్కార్‌ చెప్పుకుంటోంది. అరవయ్యేళ్ళ తర్వాత నెలకి 3 వేల రూపాయల చొప్పున పెన్షన్‌ వచ్చే పథకమిది. దీనికి నెల నెలా 55 రూపాయల నుంచి 100 రూపాయలదాకా చెల్లించాల్సి వస్తుంది కార్మికులు. ప్రమాద భీమా లక్షన్నర నుంచి 6 లక్షల వరకు పెంపు బాగానే వున్నా, నెలవారీ చెల్లింపులు.. పెన్షన్ల గోలేంటో మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. 

Image result for narendra modi

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ వృద్ధాప్య పెన్షన్లను 2 వేల రూపాయలకు పెంచింది. ఆ పెన్షన్లను ఇంకా పెంచే దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్ని గుప్పిస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, ఇంకో పదేళ్ళ తర్వాత వృద్ధాప్య పెన్షన్లు నెలకి 5 వేలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. మరి, కేంద్రం ఎప్పుడో పాతికేళ్ళ తర్వాతనో, ముప్ఫయ్యేళ్ళ తర్వాతనో మూడు వేలు నెలకి ఇస్తామంటే, దానివల్ల ప్రయోజనమేంటట.? 

Image result for narendra modi

రైతులకు పంట సాయం విషయానికొస్తే, ఒక్కో విడత 2 వేల రూపాయల చొప్పున మూడుసార్లు అంటే మొత్తం 6 వేలు, అదీ 5 ఎకరాల లోపు భూమి వున్నవారికి అందిస్తుందట మోడీ సర్కార్‌. రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి కేంద్రం ప్రకటించిన పథకాన్ని చూసి. ఎందుకంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం తరహాలో వివిధ రాష్ట్రాలు రైతుల కోసం కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడ్తున్నాయి మరి.  ఆదాయపు పన్నుకి సంబంధించి ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచడం ఒక్కటే నరేంద్ర మోడీ సర్కార్‌ తాజా బడ్జెట్‌లో ఊరటనిచ్చే అంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: