డిల్లీ మన దేశ రాజధాని, ఎవరైనా వెళ్ళొచ్చు. అందునా రాజకీయ నాయకులకు అది ఆటపట్టు. ఇపుడంటే తగ్గింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే డిల్లీలకి ప్రతీ రోజు వెళ్ళాల్సిందే. అయినా దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలతో  ముడిపడిఉన్నది అక్కడే కాబట్టి డిల్లీ  టూర్ అంటేనే ఓ ఆసక్తి.


బాబు రెడీ :


డిల్లీ టూర్ బాబుకు తప్పడంలేదు. బీజేపీతో జత కట్టిన నాలుగేళ్ళలో 29 సార్లు డిల్లీ వెళ్ళలని ఆయనే చెప్పుకున్నారు. ఇపుడు కాంగ్రెస్ రాహుల్ బాబుతో దోస్తీ చేస్తున్న బాబు గారు గడచిన ఆరు నెలల్లోనే అనేకసార్లు డిల్లీ గడప తొక్కారు. లేటెస్ట్ గా నిన్న డిల్లీ వెళ్ళి  రాహుల్ ని కలసిన బాబు 4న మరో మారు డిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి బాబు రాహులు అంతా కలసి ఆ రోజు ఈసీ వద్దకు వెళ్తారు. అదీ మ్యాటర్.


జగన్ కూదా :


ఇక వైసీపీ అధినేత పద్నాలుగు నెలల పాదయాత్ర తరువాత డిల్లీకి తొలిసారి వెళ్తున్నారు. ఆయన కూడా అదే 4వ తేదీనే వెళ్తున్నారు.  ఆయన ఏపీలో సర్వేల పేరుతో ఓట్లను తొలగిస్తున్నారంటూ అధికార తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసేందుకు డిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఇప్పటికైతే జగన్ టూర్లో మరో విశేషం లేదు. అయితే జాతీయ సర్వేలు జగన్ కే అధికారం అని చెబుతున్న వేళ అక్కడ ఆయన ఏ పార్టీ నేతలనైనా కలిసే అవకాశం ఉందేమో చూడాలి. మొత్తానికి చూసుకుంటే ఇద్దరు నాయకులూ డిల్లీకి ఒకే రోజు వెళ్తున్నారు. ఇద్దరూ కూడా ఈసీని కలవడానికే వెళ్తున్నారు. మిగతా కధ డిల్లీ తెరపైనే చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: