వైఎస్‌ షర్మిల మొదటిసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్న పార్టీ తరపున ఆమె ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా.. పోటీ చేస్తే ఎక్కడి నుంచి ఆమె పోటీగి దిగుతున్నారు. ఇప్పుడీ అంశాలు వైసీపీలోనే కాదు ఏపీ పొలటికల్ సర్కిల్లో ఆసక్తిరేపుతున్నాయి.

Image result for ys sharmila politics


వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుకోవాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ తన సోదరి షర్మిలను కూడా ఎంపీ సీటుకు పోటీకి దింపాలని భావిస్తున్నారు. మరి ఆమెను ఎక్కడి నుంచి పోటీకి దింపుతారు.. సాధారణంగా వైఎస్ కుటుంబానికి కడప జిల్లా సేఫ్ ప్లేస్.

Related image


కానీ అక్కడ ఇప్పుటికే జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ. ఆయన్ను కదిల్చే అవకాశం లేదు. అందుకే మరో సురక్షిత స్థానం ఒంగోలు.. ఇక్కడ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన్ను రాజ్యసభకు పంపే ఆలోచన ఉంది.

Related image


ఇప్పటికే ఒకసారి జగన్ తన తల్లిని విశాఖలో పోటికి దింపి ఆమె ఓటమి ద్వారా పరాభవం మూటగట్టుకున్నారు. అందుకే అలాంటి ఫలితం మరోసారి రాకుండా సేఫ్ ప్లేస్ గా ఒంగోలును నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒంగోలు జిల్లాలోనూ వైసీపీ ప్రభావం గణనీయంగా ఉంటుంది కనుక.. షర్మిల విజయం ఖాయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: