ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పశ్చిమ్‌బంగాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.   పశ్చిమ బుర్ద్వాన్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తుండగానే కొంత మంది ఆందోళన కారులు ఆనయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..కుర్చీలు విసిరేస్తూ..సభలో రసాభాస చేశారు.  కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బుర్ద్వాన్‌ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మోదీ కి సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లను చించేసి వాటి స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల పోస్టర్లను పెట్టడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మా కార్యకర్తలను తృణమూల్‌ కార్యకర్తలు బెదిరించారని.. ప్రధాని మోదీ పోస్టర్లను చించేసి తృణమూల్‌ నేతల పోస్టర్లు అంటించారని..ఇదేంటని ప్రశ్నిస్తే మా కార్యకర్తలపై దారుణంగా దాడి చేశారని భాజపా రాష్ట్ర జనరల్‌ సెక్రటకీ శయంతన్‌ బసు ఆరోపించారు.

మరోవైపు తాము పోస్టర్లను చించలేదని, భాజపా నేతలే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోస్టర్లపై నల్ల రంగు వేశారని..దీనిపై ప్రశ్నించగా వారే తమపై దాడి చేశారని తృణమూల్‌ పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన కారులు చెలరేగిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి సభ సజావుగా సాగేలా చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: