ఏపీ ముఖ్యమంత్రి కోటీశ్వరుడు కాదు, డబల్ కోటీశ్వరుడట. ఇదే ఇపుడు టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ప్రచారం కూడా చేస్తున్నారు. తమ నేతకు ఎదురులేదని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాబు ఆస్తులు అంత తక్కువా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన ఎప్పటికపుడు లెక్క చెబుతున్నారు, ప్రతీ లెక్క బాగా చూసుకుంటున్నారు అని సంతోషించాలంతే.


రెండు కోట్ల ఓటర్లపై గురి :


టీడీపీ అధినేత చంద్రబాబు తెలివైన ఎత్తుగడే వేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఎలా గెలిచారో చూసిన బాబు అచ్చం అలాగే ఏపీలోనూ చేసుకుపోతున్నారు. ఏపీలో మొత్తం ఉన్న ఓటర్లను టార్గెట్ గా పెట్టుకుని పని కానిచ్చెస్తున్నారు. ఇందులో  కొంతమంది పోయినా మిగిలిన ఓట్లతోనైనా తాను మరో మారు ఏపీ గద్దెపైన కూర్చుంటానని నమ్మకంగా ఉన్నారు. అందుకే ఒక్కొక్క‌రిగా వరాల మూట విప్పేశారు. ఏపీలో మూడు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.


వారందరికీ ప్రతీ కుటుంబానికి ఒక పధకం అమలు చేస్తూ బాబు దూసుకుపోతున్నారు. ఇప్పటికే 94 లక్షల మంది ఉన్న డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికీ పది వేల రూపాయల చెక్కులు అందించారు. అలాగే 54 లక్షల  మంది ఉన్న పించనుదారులకు రెట్టింపు పించన్లు  అందించారు. మరో యాభై లక్షల‌ మంది ఉన్న రైతుల కోసం అన్న దాత సుఖీభవ పేరిట ఎకరాకు పదివేల నగదు బదిలీ పధకం ప్రవేశపెడుతున్నారు ఇంకా మరిన్ని పధకాలను కూడా రెడీ  చేసి పెట్టుకున్నారు.


 లబ్దిదారులు ఓటేసేలా :


ఇక పధకం తీసుకున్న ప్రతి లబ్దిదారుడు ఓటేసేలా వారితో మమేకమయ్యేలా క్యాడర్ ని పురమాయించారు. అదే విధంగా ఆటో రిక్షాలకు జీవిత కాల పన్ను ను రద్దు చేశారు. దాంతో ప్రతీ ఆటో మీద థాంక్స్ టు సీఎం  అని బోర్డు పెట్టుకుని తిరగాలని బాబు కోరుతున్నారు. ఇలా అన్ని విధాలుగా రంగం సిధ్ధం చేసుకున్న బాబు తాను గెలవడం ఖాయమని గట్టిగానే భావిస్తున్నారు. మరి దీనికి విరుగుడుగా వైసీపీ జగన్, జనసేన పవన్ ఏమి  చేస్తారో చూడాలి. ఇప్పటికైతే జగన్ పధకాలను బాబు కాపీ కొట్టి మరీ  అమలుచేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: