అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ అయిన జయప్రదకు ప్రాణ భయం ఉందా. ఆమెను చంపాలని చూస్తున్నారా. ఎవరు ఇంతటి అఘాయిత్యానికి తలపెడతారు. ఈ అందాల తారకు అలాంటి ప్రమాదం ఎందుకు పొంచి ఉందా.. ఏమా కధ.


అజాంఖాన్ నుంచే :


జయప్రద తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రేదేశ్ కి చెందిన సమాజ్ వాది పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. రెండు మాలు యూపీ నుంచి ఆమె ఎంపీగా గెలిచారు. ఆమెకు అమర్ సింగ్ రాజకీయ గురువుగా ఉంటూ వచ్చారు. అయితే ఆ పార్టీలో గొడవలు, గ్రూప్ రాజకీయాలు ఈ నటి మీద ప్రభావం చూపించాయి. దాంతో ఆమె ఆ పార్టీ నుంచి తప్పుకుని అమర్ సింగ్ తో బయటకు వచ్చారు. ఈ నేపధ్యంలో జయప్రదకు సమాజ్ వాది పార్టీ నుంచి మైనారిటీ నాయకుడు అజాం ఖాన్ నుంచి ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ హాట్ కామెంట్స్ ఆమే లేటెస్ట్ గా చేశారు.


జయప్రద సంచలన వ్యాఖ్యలు :


సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే అజంఖాన్ తనను చంపాలని చూస్తున్నారని ప్రముఖ సినీ నటి జయప్రద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అజంఖాన్ ఓసారి తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతానో, లేదో కూడా తెలియడం లేదన్నారు. తనకు ఏ ఒక్క నాయకుడు మద్దతుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


మహిళలకు యుధ్దమే :


ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ముందుకు రాలేదన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్నందుకే అజంఖాన్ తనపై కక్షపెంచుకున్నారన్నారు. అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌లా భావిస్తుంటే కొందరు మాత్రం తమ ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రతిక్షణం యుద్ధమేనని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సినీనటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: