ప్రభాస్ తో తనకు అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పెట్టి కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసలు యాక్షన్ స్టార్ట్ చేశారు. ఈ కేసులో ఓ స్టూడెంట్ ను అరెస్టు చేశారు.



గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పెద్దశెట్టి వెంకటేశ్వర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐతే.. ఈ వెంకటేశ్వర్ చేసిన నేరం ఏమిటంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై కామెంట్లు పెట్టాడట. పరుష పదజాలంతో కామెంట్లు పెట్టిన వెంకటేశ్వర్ చివరకు కటకటాలపాలయ్యాడు.

Image result for sharmila and prabhas

ఐతే.. అసలు ఈ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై తీసుకుంటున్న చర్యలేమిటో ఓ పట్టాన అర్థం కావడం లేదు. యూట్యూబ్ చానల్ నిర్వాహకులను గుర్తించి వారిని విచారించారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి పంపేశారు. మరి అసలు వీడియోలు పెట్టిన నిర్వాహకులను కాకుండా కామెంట్లు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయడం ఆసక్తి కలిగిస్తోంది.

Image result for sharmila and prabhas hd


బహుశా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉండొచ్చు. చర్యలు తీసుకోవడంలో కాస్త ఆలస్యం ఉండొచ్చేమో కానీ.. తీసుకోవడం మాత్రం పక్కా అంటున్నారు పోలీసులు. సో.. త్వరలోనే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: