కే ఏ పాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతున్న సోషల్ మీడియా స్టార్.. మొదట్లో కే ఏ పాల్ అంటే ఓ లాఫింగ్ స్టాక్.. ఓ పొలిటికల్ జోకర్.. ఆయన చేసే కామెంట్లు చూసి నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు క్రమంగా ఆ పరిస్థితి మారుతోందా అనిపిస్తోంది.

Image result for ka paul interview


మొదట్లో ఒకటి రెండు చిన్నఛానళ్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేశాయి. అవి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుండటంతో మెయిన్ మీడియా కూడా మేలుకుంది. టీవీ9 వంటి నెంబర్ వన్ ఛానల్ కూడా ఇప్పుడు ఛాన్సు దొరికితే చాలు కేఏ పాల్ ను లైవ్ లోకి తీసుకొచ్చేస్తోంది.

Related image


మొదట్లో కే ఏ పాల్ ను చూసి నవ్వుకున్నా.. ఆయన ఇంటర్వ్యూలు వింటే చాలా విషయాల పట్ల పక్కా క్లారిటీతోనే ఆయన 2019 ఎన్నికల బరిలో దిగినట్టు కనిపిస్తోంది. అంతేకాదు.. ఆయన పట్ల ఇప్పటివరకూ ఉన్న అనేక అపోహలు, అభిప్రాయాలు ఆయన ఇంటర్వ్యూ చూస్తే తొలగిపోవడం ఖాయం.

Image result for ka paul interview


వచ్చే ఎన్నికల్లో మా పార్టీయే గెలుస్తుందని.. తానే సీఎం అవుతానని ఆయన కాన్ఫిడెన్స్ గా చెబుతుంటే నవ్వు వస్తున్నా.. ఆయన విశ్వాసానికి ముచ్చటేస్తుంది. మరి ఈ కే ఏ పాల్ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడు.. యూట్యూబ్ స్టార్ గా మిగులుతాడా.. సంచలనం సృష్టిస్తాడా.. చూద్దాం ఏమవుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: