చంద్ర బాబు ప్రచారం గురించి కొత్తగా చెప్పేదేముంది అయితే ఈ సారి ప్రచారం పీక్స్ లోకి చేరిందని చెప్పాలి. జనాలు ముక్కున వేలేసుకుని రీతి లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1000గా ఉన్న పింఛన్ ను రూ. 2000లకు పెంచారు. ఈ పెంచిన పింఛన్ల పంపిణీని నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చేసిన చంద్రబాబు సర్కారు.. ఈ కార్యక్రమాలను తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకునేందుకు పక్కాగా పథకాన్ని రచించింది. ఇందులో భాగంగా పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులకు భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Image result for chandrababu naidu

ఈ భోజనాల్లోనూ తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఏ మాత్రం వెసులుబాటు ఉందన్న విషయాన్ని ఆలోచించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది బాబు ఆదేశించారు... తాము పాటించాల్సిందే అన్నట్టుగా తెలుగు తమ్ముళ్లు తమ బుర్రకు తట్టిన ఉపాయాలన్నీ వాడేయడం మొదలెట్టేశారు.ఇందులో భాగంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని దొడ్డిపల్లి గ్రామంలో వింతలకే వింత  అయిన ఓ ఘటన చోటుచేసుకుంది.


ఈ వింతను చూసిన జనాలు మాత్రం చంద్రబాబు ప్రచార యావ... పిచ్చిగా మారి... ఆ పిచ్చి కూడా పీక్స్కు వెళ్లిపోయింది అని కామెంట్ చేస్తున్నారు. అయినా అక్కడి తెలుగు తమ్ముళ్లు చేసిందేమిటన్న విషయానికి వస్తే.. భోజనాల్లో వడ్డించే అప్పడాలపై ఏకంగా చంద్రబాబు బొమ్మను ముద్రించేశారు. అంతేనా... అప్పడం చివర్లలో *థ్యాంక్యూ సీఎం గారూ... ద లీడర్* అన్న అక్షాలను తాటికాయలంత అక్షరాలతో ముద్రించేశారు. చంద్రబాబు అప్పడాలుగా అక్కడికక్కడే ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త అప్పడాలను చూసి భోజనాలకు కూర్చున్న వృద్ధులు ముక్కున వేలేసుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: