అవును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రధానమంత్రి నరేంద్రమోడి పోటీ పడుతున్నారు. పాలనలో పోటీ పడితే బాగానే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నది జనాలకు వరాల జల్లు కురింపించటంలో. మరో మూడు నెలల్లో లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా ? అందుకే వరాలపైన వరాలివ్వటంలో ఇద్దరు పోటీ పడుతున్నారు. వారలు ఇవ్వటాన్ని ముందుగా చంద్రబాబే ఆరంభించారు లేండి. మోడి ఫాలో అవుతున్నారంతే. చంద్రబాబు వరాలిచ్చింది బడ్జెట్లో కాదు సుమా. నాలుగేళ్ళ హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అందులోను ఎన్నికలు వస్తున్నాయి కదా ? అందుకే ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. మోడి మాత్రం బడ్జెట్ ను సాకుగా చూపించి వరాలు కురిపించారు.

 Image result for modi and chandrababu naidu

చంద్రబాబు విషయం చూస్తే పోయిన ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు. అయినా తానిచ్చిన, ఇవ్వని హామీల్లో 98 శాతం నెరవేర్చేసినట్లు బిల్డప్ ఇచ్చేశారు. ఈనెల మొదటివారం నుండి వరాలు కురిపించటం మొదలుపెట్టారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు డబుల్ చేసేశారు. నిరుద్యోగ భృతిని వెయ్యి నుండి 2 వేల రూపాయలకు పెంచేశారు. నిజానికి రూ 2 వేల నిరుద్యోగభృతి ఇస్తానన్నది పోయిన ఎన్నికల్లో. కానీ అమలు చేసింది ఆరు నెలల క్రితమే. అదికూడా వెయ్యి రూపాయలే. కానీ హఠాత్తుగా దాన్ని 2 వేలకు పెంచేశారు.

 Image result for modi and chandrababu naidu

డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేస్తానని పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంకా నెరవేరనే లేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ మహిళ ఖాతాలోను రూ 10 వేల వేస్తానని మొన్ననే హామీ ఇచ్చేశారు. అదికూడా పోస్టుడేటెడ్ చెక్కులు ఇస్తారట. ప్రభుత్వం నుండి లబ్దిదారులకు పోస్టుడేటెడ్ చెక్కులు ఇస్తామని చెప్పటం బహుశా చంద్రబాబే ఆరంభించినట్లున్నారు. ఏం చేస్తాం ఖజానాలో చిల్లిగవ్వకూడా లేదు. మరి డ్వాక్రా మహిళల ఓట్లు కావాలి కదా ? అందుకే పోస్టుడేటెడ్ చెక్కులంటూ నాటకాలు మొదలుపెట్టారు. ఒకటి రెండు కాదు చాలా హామీలనే ఇచ్చేశారు చంద్రబాబు. ఎందుకంతగా జనాల పైన ప్రేమ పుట్టుకొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డే కారణమని చెప్పాలి. ఎలాగంటే ఇఫుడు చంద్రబాబు చేస్తానని చెప్పిన హామీలన్నీ పాదయాత్రలో జగన్ చేసిన హామీలే.

 Image result for modi and chandrababu naidu

ఇక మోడి విషయం చూస్తే చంద్రబాబుకు ఏమీ తక్కువ తినలేదు. ఆదాయ పరిమితి పెంపు, ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు, కార్మికుల కోసం పెంన్షన్ పథకం, బోనస్ పరిమితి రూ 21 వేలకు పెంపు, రైతుల కోసం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి, 50 కోట్లమందికి వైద్య సదుపాయ నిధి, ఇలా ఒకటి కాదు రెండు కాదు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి మొదలు, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు, రక్షణ రంగం అన్నింటికీ కేటాయింపులు ఉదారంగా పెంచేశారు.

 Image result for modi and chandrababu naidu

విచిత్రమేమిటంటే, చంద్రబాబైనా మోడి అయినా మొదటి నాలుగేళ్ళు ఏ ఒక్క వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరు కూడా పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వారే. రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరాలజల్లు కురిపిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పోయిన ఎన్నికలైన పోయిన తర్వాత ఏం చేశారో మళ్ళీ అదే చేయకుండా ఉంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: