ఎవరైనా నాయకుడు పార్టీ వదిలి వెళ్ళిపోతే ఎంతో కొంత నష్టం జరిగిందని అనుకుంటారు. కానీ విచిత్రంగా వంగవీటి రాధాకృష్ణ వైసిపిని వదిలేయటం వల్ల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగిందట. ఎందుకంటే, రాధా వైసిపిని వదిలేయటం వల్ల మూడు సీట్లలో క్లారిటీ వచ్చిందట. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మచిలీపట్నం లోక్ సభ సీట్లలో పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో జగన్ కు క్లారిటీ వచ్చిందట. రాధా పార్టీలో ఉన్నంత వరకూ ఇటు జగన్ తో పాటు అటు టిక్కెట్లు ఆశిస్తున్న మల్లాది విష్ణు, యలమంచిలి రవితో పాటు బందర్ ఎంపి సీటులో పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహుల్లో కూడా అయోమయం ఉండేది.

 

ఎప్పుడైతే రాధా వైసిపికి రాజీనామా చేశారు విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణుకు, తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవికి టాక్కెట్లు ఖాయమైపోయాయని సమాచారం. ఇక తేలాల్సింది మచిలీపట్నం లోక్ సభ టిక్కెట్లు ఒకటే. ఈ నేపధ్యంలోనే రాధా పార్టీని వదిలేయటం పట్ల కూడా జగన్ కు మరో లాభం కూడా జరిగిందట. అదేమిటంటే, పార్టీకి రాధా వల్ల ఎటువంటి లాభం లేదన్న విషయం అందరకీ తెలిసిందే. వైసిపి యూత్ విభాగం అధ్యక్షునిగా ఉన్న రోజుల్లో కూడా పార్టీ తరపున రాధా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. నాలుగేళ్ళ క్రితం రాజధానిగా విజయవాడ ప్రాంతం ఖాయమైనా రాధా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

నిజానికి తండ్రి వంగవీటి రంగా పేరు చెప్పుకునే రాధా రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప తనకంటూ సొంతంగా ఎటువంటి అస్తిత్వం లేదు. అంటే ఇంతకాలమూ తండ్రి పేరు చప్పుకునే బండి లాగించేస్తున్నారు. ఎప్పుడైతే జగన్ తో చెడి బయటకు వచ్చారో ఇఫ్పటి వరకూ రాధాను దేకే వాళ్ళే కనబడలేదు. టిడిపిలో చేరుతారని అనుకున్నా చంద్రబాబు కూడా రాధా వల్ల ఏమిటి ఉపయోగం అనే ఆలోచిస్తున్నారట. అందుకనే రాధా టిడిపిలో ఇప్పటి వరకూ చేరలేదు. బహుశా టిడిపిలో చేరిక కూడా డౌటనే అంటున్నారు.  ఇక జనసేన నుండి ఇప్పటి వరకూ బహిరంగంగా ఆహ్వానం అందనేలేదు. ఒక విధంగా చూస్తే వంగవీటి రాధా వైసిపి నుండి బయటకు వచ్చేయటం వల్ల జగన్ కు మేలే జరిగిందని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: