త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థులపై ఉసిగొలిపి ప్రజలను గందరగోళానికి గురిచేసి ప్రత్యర్థులపై బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టిందని దర్యాప్తు సంస్థలను తమ స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకుంటుందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు.

Related image

గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రోల్ పార్టీ చేసిన చంద్రబాబు తాజాగా పశ్చిమ బెంగాల్లో సిబిఐ పాల్పడిన చర్యపై మండిపడ్డారు.

Image result for chandrababu mamatha

కోల్‌కతా సీపీ రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి సుమారు 40 మందికి పైగా సీబీఐ అధికారులు వెళ్లడం.. అక్కడి పోలీసులు వారిని అడ్డుకున్న నేపథ్యంలో అక్కడి పరిణామాలపై చంద్రబాబు స్పందించారు.

Related image

మన వ్యవస్థలను నాశనం చేయడంలో బీజేపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇది బీజేపీ పాలనకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగుతున్నా తరుణం లో ఇలా జరగడం చాల బాధాకరం అని.  మమతా బెనర్జీ కి మేమందరం కూడా అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని సంచలన కామెంట్ చేశారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: