ఇటీవల అమెరికాలో ఉన్న విద్యార్థులను అక్కడి ప్రభుత్వం కొన్ని కొత్త చట్టాలు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తూ వారిని అరెస్టు చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. దీంతో ఈ పరిణామంతో కేంద్ర విదేశాంగ శాఖ అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.

Related image

అమెరికాలో నకిలీ యూనివర్శిటీ వలలో చిక్కుకుని జైలుపాలైన బారత విద్యార్దులను ఆదుకుంటామని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్దన్ చెప్పారు.మిషిగాన్‌లోని ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ విషయంలో ఇంతమంది భారతీయ విద్యార్థులను నిర్బంధించడం బాధాకరమైన విషయమని అన్నారు.

Image result for india america

వివిధ ప్రాంతాల్లో ఉన్న మా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. వారికి న్యాయపరమైన సాయం అందజేసేందుకు గల మార్గాలపై నిపుణులతో చర్చించాం. మన విద్యార్థుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుంది. వారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

Image result for indian students in america

సుమారు ఆరువందల మంది విద్యార్దులు ఆ వలలో చిక్కుకోగా, వారిలో అత్యదికులు భారతీయులే. దీంతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు దేశంలో కన్నీరు మున్నీరవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అక్కడ ఉన్న భారతీయ రాయబార కార్యాలయ అధికారులను అప్రమత్తం చేసి ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: