" అమరావతి నుండి అప్పడాల వరకు వదల బొమ్మాళి నిన్నొదల అంటూ తన ప్రచారం ఖండూతి కోసం ఎంత దుబారా చేయటనికైనా సరే! టిడిపి అధినేత సిద్ధంగా ఉన్నారని అర్ధమౌతుంది. ఆ దూల తీర్చుకోవటానికే ప్రజాధనం కోట్లలో ఖర్చౌతుంది "   

Related image


భారత దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత అధిక ప్రచార ఖండూతి ఉన్న రాజకీయ నేతల్లో తెలుగుదేశం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలుస్థారు.  ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ఋజు వైంది.  కొద్ది రోజుల క్రితం తిత్లీ తుఫాను బాధితులకు సాయం చేసే విషయంలో విడుదల చేసిన చెక్కులపై ఏకంగా నారా చంద్ర బాబు నాయుడు ఫోటోలు ముద్రించి మరీ ప్రచారం చేసుకున్నారు. ఆ చెక్కులు నిజంగా చట్ట ప్రకారం చెల్లవు. రాజ్యాంగం ఇలాంటి విషయాలను సహించదు. చెక్కులు ఎలాంటి షరతులను సహించని చట్టపరమైన పేమెంట్స్ కు చెందిన నెగోషియబుల్ ఇన్-స్టృమెంట్స్. వాటిపై ఎలాంటి ఎక్స్ట్రీనియస్ మాటర్ అంటే సంబంధంలేని అసంబద్ద విషయం ఉండకూడదు.

అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నాం అంటూ ఆ సందర్భంగా ఎక్కువ వివరణ ఇస్తూ తిత్లీ విపత్తును సైతం తన ప్రచారానికి వాడుకున్నారు. దీని కోసం లక్షలాది డమ్మీ చెక్కులు నారా చంద్ర బాబు నాయుడు ఫోటోతో ప్రభుత్వం ముద్రించి పంపిణీ చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును భారీగా దుర్వినియోగం చేశారు. ఇది కేవలం ప్రచారం కోసమే.
Image result for chandrababu auto driver
తాజాగా నారా చంద్రబాబు బహిరంగంగా ఆటో-కార్మికులతో మాట్లాడుతూ సినిమాటిక్ గా ఆటో డ్రైవర్ వేషంలో మీడియకు ఫోటోలు ఇచ్చి ప్రతి ఆటో వెనక తన ఫోటో ముద్రించి థ్యాంక్యూ సీఎం గారూ!... ద లీడర్*అని రాయించాలని వారికి సూచించారు. 

Related image

నారా చంద్రబాబునాయుడు తనను తాను ప్రచారం చేసుకునే విషయంలో అందరి కంటే భిన్నంగానే ఉంటారు. కేంద్రప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న పలుపథకాలకు చంద్రబాబు,  తన ట్యాగ్ లైన్ యాడ్ చేసి చేసుకుంటున్న ప్రచారాన్ని మనం ఇదివరకే చూశాం. అంతేకాకుండా రాష్ట్రంలో అమలయ్యే ప్రతి కేంద్ర పథకానికి చంద్రబాబు తనదైన స్టైల్లో పేర్లు మార్చుకుని ఆ పథకాలన్నీ తన ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చుకుంటారు. ప్రశ్నించే వారికి పథకాలు కేంద్రానివైనా అమలు చేస్తున్నది తానే కదా! అన్నది చంద్రబాబుగారి చిత్రమైన  వాదన. 


ఇప్పుడు పసుపు—కుంకుమ ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా స్త్రీలకు ఇతర ప్రజలకు ఇచ్చిన విందు భోజనాల్లో చంద్రబాబు చిత్రాలు ముద్రించిన డ్వాక్రా అప్పడాలు వడ్దించారట. అప్పడాలపై చంద్రబాబు చిత్రాలు ఆయనలోని  తీవ్ర ప్రచార ఖండూతిని బయట పెడుతున్నాయి.  ఆ ఫోటోలు ఇఫ్పుడు సోషల్ మీడియా లో హల్-చల్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: