తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. అంతేనా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ కూడా. ఆయనతోనే అంతా అన్న‌ట్లుగా జరిగిపోతూంటూంది. అటువంటి బాబుకు ఎవరైనా బ్రేకులు వేయగలరా. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని తనకు తాను గా చెప్పుకునే బాబుకు ఎవరైనా వద్దూ రావద్దూ అంటూ డోర్స్ క్లోజ్ చేయగలరా.. 


బాబుని రానివ్వం  :


చంద్రబాబు వంటి పచ్చి అవకాశ వాది రాజకీయాల్లో ఎవరూ ఉండరని బీజేపీ జాతీయ అధ్యస్ఖుడు అమిత్ షా అన్నారు. ఉత్తరాంధ్ర టూర్లో బాగంగా  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ బాబు తన సొంత మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని కైవశం చేసుకున్నారని నిందించారు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బాబు బీజేపీ, మోదీ గాలి చూసి తమ వద్దకు చేరి పొత్తుల కోసం వెంపర్లాడారని ఆరోపించారు. మోదీ వేవ్ లో గెలిచి నాలుగేళ్ళ పాటు తమతో అధికారం అనుభవించిన  బాబు కేవలం స్వార్ధ రాజకీయం కోసం ఎన్డీఏను  వీడారని విమర్శించారు. అటువంటి బాబుని మళ్ళీ తాము రానివ్వమని, ఎన్డీఏ తలుపులు ఆయనకు మూసేసిందని అమిత్ షా అన్నారు. బాబు వంటి నేతను ఏ పార్టీ కూడా విశ్వసించదని ఆయన అన్నారు.


కాంగ్రెస్ తో చెలిమి అందుకే :


అన్న ఎంటీయార్ కాంగ్రెస్ ని వ్యతిరేకించి పార్టీని పెడితే బాబు అదే కాంగ్రెస్ తో చెలిమి చీయడం ఆయన అవకాశ వాదాన్ని తెలియచేస్తోందని షా మండి పడ్డారు. బాబుకు అధికారమే పరమావధి అని ఆయన ఘాటుగా కామెంట్స్ చేశారు. ఏపీకి బీజేపీ ఎంతో చేస్తే ఏమీ చేయలేదనడం బాబుకే చెల్లిందని కూడా అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు జనంలోకి వెళ్ళి పార్టీ చేసిన కార్య్క్రమాలు వివరిస్తారని కూడా షా చెప్పుకొచ్చారు. మరో మారు ఏపీలో బాబుని అధికారంలోకి రానివ్వవద్దని షా ప్రజలకు విన్నపం చేశారు. మొత్తానికి షా, మోడీ బాబుపై బాగానే కసిగా ఉన్నార‌ని అర్ధమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: