చానాళ్ళ తరవాత దేశ రాజధానిలో అడుగెట్టిన వైసిపి అధినేత, ఏపి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడిన జగన్మోహనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  రానున్న 2019 ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా  అక్రమాలకు పాల్పడేందుకు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రాంతాల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన  పోలీసు అధికారులను వినియోగిస్తున్నారని వివరించారు.
Image result for jagan with ECI in Delhi

*మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓటర్లు ఉన్న రాష్ట్రంలో 59 లక్షలు దొంగ ఓటర్లు టీడీపీ ఆధ్వర్యంలో నమోదు అయ్యాయిని, ఇంత దారుణమైన పరిస్థితి ఎనాడూ రాలేదన్నారు. 20 లక్షల ఓట్లు పైగా హైదరాబాద్‌ లోనూ, ఆంధ్రప్రదేశ్‌ లోనూ రెండు ప్రాంతాల్లో నమోదై ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను తాను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశామన్నారు.

*దొంగ ఓట్లు ఒక వైపు చేరుస్తూనే మరోవైపు వైసీపీ సానుభూతి పరుల ఓట్లను సర్వేల పేరుతో కనుక్కొని తీసివేయించే పని కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఇలా తీయించిన ఓట్లు ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా ఉన్నాయన్నారు.

*ప్రజాసాధికారిక సర్వే, రియల్ టైం సర్వే, పరిష్కారవేదిక అనెక పేర్లతో ఓటర్ల డేటా సేకరించి టిడిపి వ్యతిరేఖుల ఓట్లను గుర్తించి వాటిని పనిగట్టుకొని తొలగించే కార్యక్రమం చేస్తున్నారని జగన్మోహనరెడ్డి వివరించారు. టిడిపి కర్యకర్తల పేర్లతో ప్రత్యేకంగా సుచిక్షితులైన వ్యక్తులను ఈ కార్యక్రమానికి వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. 
Image result for jagan with ECI in Delhi
*చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సీఐ లను డీఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ లిస్ట్‌ లో మొత్తం సొంత సామాజిక వర్గం వారిని సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని జగన్మోహనరెడ్డి ఆరోపించారు. 37 మంది సీఐ లకు ప్రమోషన్లు రాగా వారిలో చంద్రబాబు సామాజిక వర్గం వారే 35 మంది ఉన్నారని ఆ జాబితా చూపించారు. ఆ మిగిలిన ఇద్దరు సీఐలు కూడా చంద్రబాబు సామాజికవర్గంలో వివాహ సంబంధం కలిగి ఉన్నారని సాక్ష్యంగా ఆ జాబితాను ఎన్నికల సంఘానికి ఇచ్చామని అన్నారు.

*ఎన్నికలు సజావుగా జరగాలంటే రాష్ట్ర ఆర్పీ డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావులను వెంటనే బదిలీ చేయాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

*సోమవారం జగన్‌మోహనరెడ్డి బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి - సునీల్‌ అరోరాను కలిసి అధికార తెలుగు దేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.
Image result for jagan with ECI in Delhi
*శాంతి భద్రతల విభాగం కోసం సమన్వయ కర్త పదవి ఒకటి సృష్టించి నారా చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాసరావు కు ఆ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఎన్నికలు నడిపించేందుకు కీలకమైన అన్ని స్థానాల్లోనూ నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని ఆధారాలను కూడా వారికి అందించామని జగన్మోహనరెడ్డి మీడియాకు.

*ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే ఈ పోలీసు అధికారులను కనీసం ఎన్నికల సమయంలో ఎన్నికల విధులకు సుదూరంలో ఉంచాలని జగన్ కోరారు. వీరి స్థానంలో ఎవరిని నియమించినా తమకు అభ్యంతరం లేదన్నారు జగన్‌. 

ఎప్పుడూ ప్రజాస్వామ్యం అంటూ సేవ్ డెమాక్రసీ - సేవ్ నెషన్ అంటూ - ఘోషించే టిడిపి అధినేత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాష్ట్రంలో మాత్రం కులస్వామ్యాన్ని పెంచి పోషిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు సామాజిక వర్గంలో కూడా ఆయన కారణంగా, ఆయన మద్దతు మీడియా కారణంగా, తమ సామాజికవర్గం పట్ల ఇతర సామాజికవర్గాల్లో, పెల్లుభుకుతున్న వ్యతిరేఖతను వాళ్ళు సైతం అంగీకరించ లేకపోతున్నారు.
Image result for jagan chandrababu
ఫలితంగా చంద్రబాబు పట్ల కమ్మ సామాజికవర్గంలో అధిక సంఖ్యలో ఈ సారి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్షేత్ర స్థాయి సమాచారం. అందుకే ఇది గమనించిన బాబు ఓటర్ల లిష్ట్స్ లో మాయ చేసేపనిలో పడ్దారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: