టీడీపీ పార్టీ లో ఒక పక్క సిట్టింగులు , మరో పక్క ఓడిపోయిన వారు ఇంకొక పక్క ఫిరాయింపు నేతలు ఉన్నప్పటికీ చంద్ర బాబు ఇంకా చాలా మంది ని పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. కర్నూలులో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీని ఫిరాయింపుజేసుకున్నారు. అయినా.. ఆశ తీరలేదు. ఇప్పుడు కర్నూలు మాజీ ఎంపీ కోట్లను చేర్చుకునే ప్రయత్నంలో ఉంది తెలుగుదేశం. ఆ వ్యవహారం అలా సాగుతూ ఉండగానే.. అరకు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ కు కూడా తెలుగుదేశం వల వేసేసిందని తెలుస్తోంది.

చంద్ర బాబు ప్రచారం పిచ్చి చూశారా ... అప్పడాలను కూడా వదిలి పెట్టలేదు ...!

కాంగ్రెస్ కు రాజీనామా చేసేసినట్టుగా ప్రకటించారు కిషోర్ చంద్రదేవ్. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడని తెలుస్తోంది. కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ తరఫున పలుసార్లు విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే నిలిచి ఈయన రాజకీయంగా దెబ్బతిన్నారు. అరకు నుంచి పోటీ చేయించడానికి ఈయనను తెలుగుదేశం పార్టీ  తీసుకుంటోందని తెలుస్తోంది.

Image result for chandrababu naidu

ఎంతమంది ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకున్నా.. చేరి వచ్చిన వారిపై చంద్రబాబుకు నమ్మకం లేనట్టుగా ఉంది. ఎంతమంది నేతలు వస్తే తన పార్టీ అంత బలోపేతం అవుతుందని బాబు అనుకుంటున్నట్టున్నారు! అది కూడా అధికారంలో ఉన్న పార్టీ.. ఇలా తెరమరుగు అయిన నేతలను కూడా తీసుకొచ్చి తన తరఫున బరిలోకి దింపుతుండటం విశేషమే. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న నేపథ్యంలోనే.. చంద్రబాబు నాయుడు తెరమరుగు అయిన నేతలను తెచ్చి వారి పాత ఇమేజ్ లను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టున్నాడని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: