ఏపీలో ఎన్నికలు ఈసారి వాడి వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు అనగానే జనంలో ప్రచారం, హామీలు ఇవ్వడం, అభ్యర్ధులను పెట్టడం సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవేనా. ఎన్నికలు అంటే తిట్ల దండకం, విమర్శలు, ప్రతి విమర్శలు, మొత్తం అన్ని జిల్లాల్లో టూర్లు వేయడం ఇవేనా..ఎన్నికలు అంటే సభలకు వచ్చే జనాలు, సర్వేలు ఇచ్చే రేటింగులు ఇవేనా...


కాదంటున్న జగన్ :


జగన్ ఈ సత్యం తెలుసుకునేసరికి మళ్ళీ ఎన్నికలు ఏపీలో వచ్చేశాయి. 2014 నాటి జగన్ అయితే మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళి బాబు చేతిలో మరో ఓటమిని చవి చూసేవారు. కానీ ఇపుడు జగన్ అలా కాదు, బాగా రాటుతేలారు. అది జగన్ వేసే ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. జగన్ తన పాదయాత్రలో వెల్లువలా వచ్చిన జనాన్ని చూసి మురిసిపోవడంలేదు. మీరే కాబోయే సీఎం అంటూ నిత్యం తనను కలసిన నాయకులు చెప్పే మాటలను విని సంతోషపడడంలేదు. వైసీపీదే ఏపీలో అధికారం అంటూ గత కొన్ని నెలలుగా జాతీయ సంస్థలు చేసిన సర్వేలు చూసి సంబరపడడంలేదు. జగన్ ఇపుడు బాబు అన్ని  వ్యూహాలను గమనిస్తున్నారు. వాటిని వమ్ము చేయడం ఎలా అని ఆలొచన చేస్తున్నారు.


అందుకే ఈసీకి ఫిర్యాదు :


ఏపీలో దాదాపుగా అరవై లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఈ మాట వింటేనే గుండె జల్లుమంటోంది. మొత్తం ఓటర్లు మూడు కోట్ల మంది ఉంటే అందులో అయిదవ వంతు నకిలీ ఓట్లు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చేటు కలిగించే పరిణామం. ఎపుడూ ఒకే పార్టీ గెలిచేలా చేసుకుంటున్న గొప్ప పధకం, దీన్ని గుర్తించకుండా గుడ్డిగా ఎన్నికలకు వెళ్తే ప్రతీ చోటా జనాదరణ ఉన్నా కూడా నకిలీ   ఓట్లతో ఓటమి తప్పదు. సరిగ్గా జగన్ ఇదే ఆలొచించారు. ఏకంగా ఈసీని కలసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించకపోతే ఎన్నికలు జరిపినట్లే కాదని బలమైన వాదన వినిపించి తగిన ఆధారాలు కూడా సమర్పించారు.


ఇక గత కొంత కాలంగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారు. అలా నాలుగు లక్షల ఓట్లు అపుడే గల్లంతు అయ్యాయి. ఆ వివరాలు సైతం జగన్ అందించారు. అదే విధంగా ఎన్నికల్లో  పంచేందుకు నగదు నాలుగు వేల కోట్ల రూపాయల వరకూ దాచారని, వాటిని పంపిణీ చేసేందుకు కూడా అధికార పార్టీ సిధ్ధంగా  ఉందని జగన్ ఈసీని కలసి ఫిర్యాదు చేశారు. వీటికి తోడు అధికార పార్టీకి అండగా ఉంటున్న పొలీసుల వివరాలు కూడా జగన్ ఇచ్చారు. వారిని పక్కన పెడితే తప్ప ఎన్నికలు సజావుగా జరవన్న తన వాదన బాగానే  వినిపించారు. నిజంగా ఈసీ కనుక గట్టి చర్యలు తీసుకుంటే అది టీడీపీకి శరాఘాతమే. అదే వైసీపీ సాధించిన తొలి విజయం కూడా అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: