చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపుపై నిజంగానే చంద్రబాబునాయుడు అంత దీమాగా ఉంటే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు ? సందర్భం ఏదైనా సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం అన్నది చంద్రబాబుకు మొదటి నుండి ఉన్న అలావాటే. అక్కడితో ఆగితే సమస్యే లేదు ప్రతీ సందర్భంలోను జగన్ పై ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దాంతోనే అందరికీ చంద్రబాబులోని ఓటమి భయం కనబడుతోంది. తనమీద తనకు గెలుపు నమ్మకం లేనందు వల్లే జగన్ ను పలుచన చేసి, తక్కువగా మాట్లాడుతున్నట్లు అర్ధమైపోతోంది.

 Image result for chandrababu naidu fear

చంద్రబాబు తాజాగా గన్నవరంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓట్లేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే అన్నారు. తప్పుడు సర్వేలతో జనాలను మభ్యపెడుతున్నట్లు మండిపడ్డారు. నిజానికి సర్వేలు చేసింది జాతీయ మీడియా సంస్ధలు. ఒకటికాదు రెండు కాదు. ఇఫ్పటికి పదిసంస్ధలు ఏపిలో సర్వేలు చేశాయి. ఏ సర్వేలో కూడా పరిస్దితులు చంద్రబాబుకు సానుకూలంగా  లేవని తేల్చాయి. దాంతో చంద్రబాబుకు ఒకవైపు టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు సర్వేల పేరుతో జాతీయ మీడియా వాస్తవ పరిస్దితులను జనాల ముందుంచుకుతున్నందుకు మండిపోతున్నారు.

 Image result for chandrababu naidu fear

సర్వేలతో జగన్ మభ్య పెడుతున్నారంటే అర్ధం జాతీయ మీడియాను మ్యానేజ్ చేసుకున్నారనేనా ? మీడియాను మ్యానేజ్ చేసేంత సామర్ధ్యం జగన్ కు ఉందని  అనుకోవటం లేదు. ఆ లక్షణాలన్నీ చంద్రబాబుకున్న విషయం ఇప్పటికే నిరూపితమైంది. జగన్ ది పవిత్రమైన పాదయాత్ర కాదట. పాదయాత్రలో పవిత్రం, అపవిత్రమని ఉండవు. పాదయాత్ర పూర్తి చేశాడా లేదా అన్నదే చూస్తారు. చెప్పిన మేరకు జగన్ 3648 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారంతే. ఆమాటకొస్తే చంద్రబాబు కూడా గతంలో పాదయాత్ర చేశారు కదా ? అందులో పవిత్ర ఏముంది ? చంద్రబాబు చేసినా జగన్ చేసిన అధికారం కోసమే.

 Image result for chandrababu naidu fear

కెసియార్, జగన్ మోడికి వందిమాగధులట. మొన్నటి వరకూ ఇదే చంద్రబాబు అదే మోడికి వందిమాగధుగా ఉన్న విషయం మరచిపోయినట్లున్నారు. ఇదే చంద్రబాబు అదే కెసియార్ తో పొత్తులు పెట్టుకుందామని పాకులాడిన విషయం అందరికీ తెలిసిందే కదా ? చంద్రబాబుతో పొత్తుకు కెసియార్ ఛీ కొడితేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దాంతో పొత్తును తెలంగాణా ఎన్నికల్లో జనాలే ఛీ కొట్టారు. ఆ విషయం జనాలకు గుర్తుండదని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు.

 Image result for chandrababu naidu fear

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ నివేదిక తర్వాత మోడి మొహం ఎక్కడ పెట్టుకుంటారు ? అంటూ అడగటమే విచిత్రంగా ఉంది. కోడి కత్తి కేసులో భయపడుతున్నదే చంద్రబాబు. అందుకే కేసు దర్యాప్తును ఎన్ఐఏ విచారించేందుకు వీల్లేదంటూ కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. పైగా జగన్ ను హత్యచేసేందుకు నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడనే కదా ఎన్ఐఏ తేల్చింది ? పైగా నిందితుడును ప్రేరేపించి హత్యకు కుట్ర చేసిందెవరు ? అన్న విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లే కదా ఎన్ఐఏ చెప్పింది ? కుట్ర కోణం బయటపడకూడదనే కదా చంద్రబాబు కోర్టుల చుట్టూ తిరుగుతున్నది ? కుట్ర కోణంలో టిడిపి నేతల పాత్ర లేకపోతే చంద్రబాబులో ఎందుకంతే భయం ? సో జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబులో ఓటమిభయం వెన్నాడుతున్నట్లే కనబడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: