స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నీ హద్దును దాటేశారు. తాను స్పీకర్ అని, రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉండాలనే కనీస విజ్ఞతను కూడా మరచిపోయి చంద్రబాబునాయుడునే గెలిపించాలంటూ జనాలకు పిలుపిచ్చేశారు. చంద్రబాబు ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబునే గెలిపించాలని చెప్పారు. పైగా చంద్రబాబుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపుందని చెప్పటం వివాదాలకు దారితీసింది.

Image result for kodela sivaprasad rao party meetings

మామూలుగా స్పీకర్ లాంటి రాజ్యాంగబద్దమైన పదవులకు ఎన్నికైన వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అంటే తనకు అన్నీ పార్టీలు సమానమే అని చెప్పటం కోసమే తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలి. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో స్పీకర్ గా ఎంపికైన కోడెలకు మాత్రం అటువంటి విజ్ఞత ఏమీ ఉన్నట్లు లేదు.

 Image result for kodela sivaprasad rao party meetings

స్పీకర్ గా ఎంపికైనా దగ్గర నుండి కోడెల వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉంటోంది. చంద్రబాబు ఫిరాయింపులకు పాల్పడినా కోడెల పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా ఫిరాయింపు ఎంఎల్ఏలపై  అనర్హత వేటు వేయమని ఎంతగా మొత్తుకున్నా కోడెల ఏమాత్రం లెక్క చేయలేదు. ప్రభుత్వంపై వైసిపి అవినీతి ఆరోపణలు చేస్తున్న సమయంలో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా టిడిపి సభ్యులు గోల చేసేవారు. అటువంటి సమయంలో వెంటనే జగన్ మాట్లాడుతున్నా మైక్ ను కట్ చేసేసేవారు. అదే మంత్రులో లేకపోతే టిడిపి సభ్యులో జగన్ ను అమ్మనాబూతులు తిడుతుంటే మాత్రం మాట్లాడేందుకు పూర్తిగా అనుమతించేవారు.

Image result for kodela sivaprasad rao party meetings

తాను తెలుగుదేశంపార్టీ నేతనే అని చెప్పుకోవటానికి కోడెల ఏనాడు అసెంబ్లీలో వెనకాడలేదు. అధికారపక్షం సభ్యులకు ఒక రూలు, ప్రతిపక్ష సభ్యులకు ఒకరూలు అన్నట్లుగా కోడెల వ్యవహరించేవారు. నిబంధనలకు విరుద్ధంగా వైసిపి ఎంఎల్ఏ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసి తన స్వామిభక్తిని చాటుకున్నారు. రోజా ఏడాది సస్పెన్షన్ చెల్లదని కోర్టు చెప్పినా కోడెల పట్టించుకోలేదు. తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటునే ఉన్నారు. పైగా జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు వాటికి బోనస్.

 Image result for kodela sivaprasad rao son

సత్తెనపల్లికి జగన్ వచ్చి కోడెలపై అవినీతి ఆరోపణలు చేశారట. ప్రతీ చిన్నపనికీ లంచం తీసుకుంటున్నారని, అవినీతి ప్రభుత్వమని అన్నందుకు కోడెల రెచ్చిపోయారు. నిజానికి కోడెల కుటుంబీకుల అవినీతి, దౌర్జాలపై జిల్లాలో బాగా ప్రచారంలో ఉంది. కోడెల కొడుకు, కూతురు విచ్చలవిడిగా వసూళ్ళు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని పార్టీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారని కూడా ప్రచారంలో ఉంది. అలాంటిది అవే ఆరోపణలను జగన్ ప్రస్తావించడాని కోడెల రెచ్చిపోవటం విచిత్రంగా ఉంది.

 Image result for kodela sivaprasad rao daughter

16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి చంద్రబాబు లాంటి గొప్ప నేతను వేలెత్తి చూపే ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని నిలదీయటంలో ఏదో అంతరార్ధం ఉన్నట్లే అనుమానం వస్తోంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా కోడెలలో ఏదో హిడెన్ అజెండా ఉండే ఉంటుంది. అందుకనే చంద్రబాబును అంతలా మోసేస్తున్నారు. చూద్దాం అదేదో బయటపడకపోతుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: