భారత సాంకేతిక అభివృద్ధికి పితామహుడినని, నాలుగు దశాబ్ఢాల సుధీర్ఘ రాజకీయ అనుభవం దేశంలో వేరే నాయకుడికి లేదని ప్రవచించే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సాంకేతికతపైనే నమ్మకం కోల్పోయినట్లుంది. అందుకే  కాంగ్రెస్ కురువృద్ద నాయకులు గులాం నబి అజాద్, అహ్మద్ పటేల్, లోక్-సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టి నాయకుడు మల్లిఖార్జున ఖర్గే,  నేషనల్ కాన్-ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టిఎంసి నాయకుడు డెరెక్-ఓ-బ్రియన్, సిపీఐ నాయకుడు డి రాజా తదితర బిజేపి-ఎండీఏ వ్యతిరేక పక్షాలతో కలసి నిన్న సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంల అవకతవకలపై చర్చించారు.  
Image result for opposition leaders meeting CEC on Paper Ballot
ఈసీని కలిసిన విపక్షాలు తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 2019 ఎన్నికలకు సమయం అంతగా లేదు కాబట్టి కనీసం 50 శాతం వీవీ-ప్యాట్-స్లిప్‌ లను పోలైన ఓట్లతో సరి చూడాలని కోరారు.  ఈవీఎంలలో అవకతవకలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మీడియాకు తెలిపారు.
Related image
లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు, పోలైన ఓట్లలో కనీసం 50 శాతం వీవీ-ప్యాట్‌-స్లిప్పు లను సరి చూడాలని ఈసీని కోరామని ఆజాద్ చెప్పారు. ఈవీఎం లపై రూపొందించిన నివేదికను సీఈసీకి అందజేసిన విపక్ష నేతలు అనంతరం మీడియాతో మాట్లాడారు.  సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్‌-బ్యాలెట్‌ పద్ధతే పాటిస్తున్నాయన్న చంద్రబాబు పోలైన ఓట్లలో వీవీ-ప్యాట్‌-స్లిప్పులు ఒక్కశాతం మాత్రమే లెక్కిస్తున్నారన్నారు. ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 
Image result for opposition leaders meeting CEC on Paper Ballot
కాదంటుంది. అలాగే తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబబు కూడా ఈవీఎం ల ద్వారానే ఎన్నికల్లో గెలిచారు అలాగే మమత బెనర్జి ఇలా వీళ్ళే ప్లేట్ ఫిరాయించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందులో ఏవైనా లోపాలు ఉంటే సవరించాలి కాని అసలు ఆ సాంకేతికతనే వద్దనటం న్యాయం ఏమాత్రం కాదంటున్నారు విశ్లేషకులు. 

Image result for chief election commissioner of india

మరింత సమాచారం తెలుసుకోండి: