తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు విచారణ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. పూటకో పేరు.. గంటకో కోణం బయటకొస్తుండడంతో వారం రోజులుగా ఈ క్రైం స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. అంతిమంగా ఈ హత్య ఆర్థిక నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చినా విచారణలో భాగంగా వెలుగుచూసిన అనేక కోణాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.  కేసు విచారణలో పలు అనైతిక వ్యవహారాలు వెలుగు చేశాయి.  వివాహేతర  సంబంధాలు, డేటింగ్‌లు తదితర అంశాలు బహిర్గతమమయ్యాయి.

Image result for sikha chowdary

ఈ కేసులో శిఖాచౌదరికి ప్రత్యక్ష ప్రమేయం లేదని తేల్చేసిన పోలీసులు.. రాకేష్ రెడ్డే ప్రధాన సూత్రధారి అంటూ నిర్ధారిస్తున్నారు. జయరాంను 31 వ తారీఖు ఉదయమే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ రోజు మధ్యాహ్నం 3గంటల తర్వాత డెడ్ బాడీని కారులో ఎక్కించి.. నందిగామ వరకూ వచ్చిన రాకేష్ రెడ్డి.. అయితవరం పరిసరప్రాంతాల్లో కారు వదిలేసి తిరిగి తాను హైదరాబాద్ వెళ్లినట్టు రాకేష్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. రాకేష్ రెడ్డి శిఖా చౌదరి ద్వారా జయరాంకు నాలుగున్నర కోట్లు అప్పు ఇప్పించారని ఇప్పటివరకూ  జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో రాకేష్ రెడ్డి  కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. రాకేష్ రెడ్డి శిఖా చౌదరిని వదిలేసేందుకే  నాలుగున్నర కోట్లు డీల్ కుదిరిందని. అడబ్బును ఇస్తానన్న జయరాం ఇవ్వనందుకే రాకేష్ రెడ్డి , జయరాం మధ్య ఆర్ధిక వివాదం మొదలైందని పోలీసులు చెబుతున్నారు.

Image result for sikha chowdary

అయితే రాకేష్ రెడ్డి తన డబ్బుల కోసం.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. జయరాం లిఫ్ట్ చేయకపోవడంతో రీనా అనే అమ్మాయి పేరుతో జయరాంను ట్రాప్ చేసిన రాకేష్ కొంతకాలం రీనా పేరుతో వాట్సాప్ లో  చాటింగ్ చేసి.. హత్య జరిగిన రాత్రి తన ఉంటున్న దగ్గరికి రప్పించారని పోలీసుల కథనం.. జయరాం.. ఈ మెసేజ్ లను నమ్మి.. రాకేష్ రెడ్డి ట్రాప్ లో పడ్డారని.. పోలీసులు తేల్చారు. ఆరోజు జయరాం అనుకోని రీతిలో రాకేష్ రెడ్డిని కలుసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య పెనుగులాట జరగడం.. రాకేష్ రెడ్డి బలంగా జయరాంను గుండెల మీద కొట్టడంతో . అప్పటికే హార్ట్ పేషెంట్ అయిన జయరాం.. చనిపోయాడని రాకేష్ రెడ్డి పోలీసుల ముందుకు ఒప్పుకున్నాడు.

Image result for sikha chowdary

జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డితో పాటు మరో  ముగ్గురు సహకరించినట్టు చెబుతున్న పోలీసులు శిఖాచౌదరి పాత్ర ఏమాత్రం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో శిఖా చౌదరికి ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా.. తన వలపువలలో పడిన జయరాం.. ఆమెకోసం ఇవ్వజూపిన నాలుగున్నరకోట్లు ఇవ్వకపోవడంతోనే ఈ హత్య జరిగిందనేది స్పష్టమౌతోంది. అయితే ఆమె పాత్ర లేదని పోలీసులు చెప్పడం.. అదే సమయంలో జయరాం భార్య పద్మశ్రీ ..జయరాం బందువుల పాత్ర ఉందని..పరోక్షంగా శిఖా చౌదరిపై అనుమానాలు వ్యక్తం చేయడం పోలీసు దర్యాప్తు తీరుపైనా  అనుమానాలను రేకెత్తిస్తోంది.

Image result for sikha chowdary

ఈ కేసులో కీలకంగా మారిన శిఖా చౌదరి పోలీసుల విచారణలో చెప్పిన అనేక విషయాలు కూడా కేసులో కీలకంగా మారాయి. తన మేనమామ వ్యక్తిగతంగా అంత మంచి వాడు కాదని దర్యాప్తులో శిఖాచౌదరి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.  తనను, సోదరిని లైంగికంగా వేధించే వాడని శిఖా పోలీసులకు చెప్పింది.  తనకు రెండు పెళ్లిళ్లు అయినట్లు, ఒకరితో విడాకులు ఇంకా రావాల్సి ఉందని వివరించారు. కొన్ని కంపెనీల్లో ఆమెను డైరెక్టర్‌గా నియమించారు. తన సోదరికి కోట్లు ఖర్చు చేసి మెడికల్‌ సీటు ఇప్పించిన విషయాన్ని అంగీకరించారు. తాను రాకేష్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా అంగీకరించిన శిఖాచౌదరి.. అయితే తన మేనమామ జయరాం తనకు మధ్య వివాహేతర సంబంధంతో తనకు రాకేష్‌కు తరచూ గొడవలు వచ్చేవని అంగీకరించారు. వివాహం చేసుకోవాలని అనుకొన్నామని చెప్పారు ..  31న రాత్రి తాను శ్రీకాంత్‌ అనే వ్యక్తితో లాంగ్‌ డ్రైవ్‌కు వికారాబాద్‌ ప్రాంతానికి వెళ్లానని .. అలాంటప్పుడు ఈ హత్యతో తనకు సంబంధం ఎలా ఉంటుందని శిఖాచౌదరి పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చింది.   తనకు హత్యతో సంబంధం లేదని ఆమె వివరించే ప్రయత్నం చేసింది. అయితే జయరాం మర్డర్ విషయాన్ని రాకేష్ మొదట శిఖాకే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన జయరాం ఇంటికి చేరుకున్న శిఖ.. తనకు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్లను తెచ్చుకుంది. మొత్తానికి అక్రమ సంబంధాలు, అనైతిక ఆర్థిక వ్యవహారాలు జయరాంను పొట్టన పెట్టుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: