నా ఇష్టం నా ఛానల్ అంటూ నాగబాబు చేస్తున్న అతి ఇప్పడూ మెగా అభిమానులకు కూడా నచ్చడం లేదు . మొదట్లో బాగానే ఇప్పుడు మాత్రం అతి గా తయారైందని చాలా మంది ఆరోపిస్తున్నారు. గతంలో నాగబాబు కత్తిమహేష్ పై విమర్శలు చేశాడంటే అది అవసరం, శ్రీరెడ్డి విషయంలో ఫ్యామిలీ తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అది ఆత్మాభిమానం. పవన్ కల్యాణ్ తెలియదన్న బాలయ్యను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకున్నాడంటే అది తమ్ముడిపై ఉన్న ప్రేమ. మరిప్పుడు నాగబాబు చేస్తున్నదేంటి?

Image result for nagababu

సోషల్ మీడియా వేదికగా తన సొంత యూట్యూబ్ ఛానెల్ ని అడ్డం పెట్టుకుని నాగబాబు చేస్తున్న హంగామా ఏవగింపు కలిగిస్తోంది. లోకేష్ బాబు భాషా పరిజ్ఞానంపై జోకులేశాడు సరే, చంద్రబాబుపై విమర్శలు చేశాడు సరే, చివరికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై కూడా ఎగిరిపడే సరికి మెగా అభిమానులు కూడా నాగబాబుని చీదరించుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా నాగబాబు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడనే చర్చ మొదలైంది. ఈ ఎపిసోడ్ కి పరాకాష్టలా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కూడా నోరు పారేసుకున్నాడు నాగబాబు. మహిళల వస్త్రధారణ విషయంలో బాలు ఆవేదనపై అతిగా రియాక్ట్ అయ్యాడు.

Image result for nagababu

అంతా చూస్తుంటే అంతా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో చేసినట్టు నాగబాబు ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా చేసేట్టు కనిపిస్తున్నాడు. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే.. నాగబాబు మొదటి నుంచీ ఇదేతరహా మనిషి అనుకుంటే ఎవరూ ఇంత ఇదిగా పట్టించుకోరు. కానీ ఇన్నాళ్లూ పెద్దమనిషిలా వ్యవహరించిన ఈయన, ఇప్పుడు ఒక్కసారిగా తనలోని అపరిచితుడ్ని బయటకు తీసుకొచ్చాడు. ఇకనైనా ఈ ఓవర్ యాక్షన్ ఎపిసోడ్ కి మెగా బ్రదర్ ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని అంటున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: