రాయలసీమ పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా కర్నూలు జిల్లాలో  మంచి ఫాలోయింగ్ ఉన్న నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డి. ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేశారు. కానీ అయన అడుగులు ఎటువైపు అన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. కోట్ల కనీసం మూడు నాలుగు అసెంబ్లీ  సీట్లను ప్రభావితం చేయగలరని పేరుంది. 


టీడీపీకి షాకేనా :


కోట్ల టీడీపీలో చేరాలని మొదట అనుకున్నారు. కుటుంబంతో సహా ముఖ్యమంత్రిని కలిసారు. అయితే ఆయన కొన్ని షరతులు పెట్టారు. వాటిని బాబు ఆమోదిస్తేనే పార్టీలో చేరేది అని స్పష్టం చేశారు. ఆలూరు, డోన్ అసెంబ్లీ సీట్లతో పాటు, కర్నూల్ ఎంపీ సీటు కోట్లకు ఇవ్వాలన్నది ఆ కండిషన్. ఇక అక్కడ సీట్లు ఆశిస్తున్న వారితో పాటు, కర్నూల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి వంటి వారు కోట్ల రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు కోట్లకు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. దీంతో చికాకు పడ్డ కోట్ల తనకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయని మీడియా మీటింగ్ పెట్టి షాక్ ఇచ్చేశారు. తాను ఆషామాషీ ఫిగర్ ని కానని బాబుకు ఇండైరెక్ట్ గా కౌంటరేశారు.


వైసీపీ నుంచి :


ఇక మరో వైపు కోట్లకు వైసీపీ నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయని సమాచారం. నిజానికి కోట్ల కుటుంబానిది కాంగ్రెస్ కల్చర్. దాంతో ఆయన చేరితే వైసీపీలో చేరాలని ఆయనకు క్యాడర్ మొదటి నుంచి చెబుతోంది. కోట్ల టీడీపీలోకి వెళ్ళడం మెజారిటీ క్యాడర్ కి ఇస్ష్టం లేదని అంటున్నారు. ఇక కోట్ల కుటుంబంలోనే సొంత సోదరుడు కోట్ల టీడీపీ అయితే తాను వైసీపీ అని ప్రకటించేశారు కూడా అక్కడ తన ప్రత్యర్ధి కేఈ తో పేచీలు, క్యాడర్ కి ఇబ్బందులు, పైగా చంద్రబాబుతో వ్యవహారం. ఇవన్నీ చూసుకున్న కోట్ల ఇపుడు వైసీపీ వైపుగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అయితే కోట్లకు అడిగిన సీట్లు వైసీపీ ఇస్తేనే ఈ డీల్ కుదురుతుంది మరి జగన్ కోట్లను చేజారిపోకుండా చూడాలని పార్టీ నేతలను ఆదేశించారంటే ఫ్యాన్ నీడకు పెద్దాయన వచ్చేసినట్లేనని అంటున్నారు.  అదే జరిగితే చంద్రబాబుకు షాక్ తప్పదంటుకోట్ల యూ టర్న్.. ఆ పార్టీకి షాకేనా..!?
న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: