చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయనకు రాజకీయంగా తెలినని ఎత్తులు లేవు. ఆయన వేయని ఎత్తులు లేవు. ఆవలిస్తే పేగులు లెక్కించే బాబు అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్నారు బాబు జాతీయ రాజకీయాలో మళ్ళీ ఇపుడు చక్రం తిప్పేదుకు రెడీ అయిపోయారు. అయితే బాబు చేతికి స్టీరింగ్ దొరుకుతుందా...


రాహులు ప్రధాని కాడట :


బాబు పార్టీలో సీనియర్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఆయన ఏకంగా అధినేత మీదనే సెటైర్లు వేస్తారు. డిల్లీలో జరిగిన టీడీపీ ఎంపీల దీక్షా  శిబిరంలో జేసీ మాట్లాడుతూ రాహుల్ ఈ దేశానికి ప్రధాని కాలేడంటూ బాంబు పేల్చారు. రాహుల్ కి ఆ నాయకత్వ లక్షణాలు లేవని కూడా అనేశారు. ప్రత్యేక హోదా ఇస్తానని రాహులు అన్నారని బాబు ఆయన వెంట పడుతున్నారు తప్ప ప్రధాని కాలేరంటే కాలేరని కుండబద్దలు కొట్టేశారు. ఓ విధంగా బాబు గాలిని జేసీ తీసేశారు. రాహులు ని ప్రధాని చేయడం  కోసేమే సోనియా ఏపీని అడ్డంగా విడగొట్టిందని కూడా మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అనర్ధాలకు కారణమని జేసీ అనడంతో ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేస్తున్న చంద్రబాబుకు ఇది ఇబ్బందికరమే.


మోడీ అవుతారా :


జేసీ ఈ మాటలు చెప్పారంటే యూపీయే మళ్లీ అధికారంలోకి రాదని భావించినట్లేగా. ఇక రాహుల్ ప్రధాని కాకపోతే ఎవరికి చాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ కి వచ్చినన్ని సీట్లు కూడా ప్రాంతీయ పార్టీల అధినేతలకు రావు. అంటే ఓ విధంగా మోడీ ప్రధాని అవుతారని జేసీ చెప్పకనే చెప్పినట్లైంది. మరి ఈ మాత్రం రాజకీయం, భవిష్యత్తు పాలిటిక్స్ చంద్రబాబుకు తెలియవనుకోవాలా. చంద్రబాబుని మళ్ళీ ఎన్డీయేలోకి  రానీయమని ఏపీలో అమిత్ షా చెప్పేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాదని జేసీ బాహాటంగానే అన్నారంటే ఇక విపక్షం, బీజేపెకి ప్రత్యామ్నాయం అంటూ డిల్లీ పట్టుకు తిరుగుతున్న బాబుకు ఈ పాటికే అసలు మ్యాటర్ అర్ధమైపోవాలి. ఏ విధంగా చూసుకున్నా బాబు ఈసారి డిల్లీలో చక్రం తిప్పలేరు. అంటే బాబు ఇపుడు హస్తిన లో పెడుతున్న మీటింగులు, చేస్తున హడావుడి అంతా వ్రుధా ప్రయాసేనన్నమాట. అంటే అటు పార్టీని, తమ్ముళ్లను నమ్మించడానికే  బాబు ఇలా చేస్తూ ఉండాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: