తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించారు. పార్టీని బలోపేతం చేసే వ్యూహాల గురించి చర్చించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారట.

Image result for rahul and revanth


ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ఓటమి గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఓడారాట. రేవంత్.. నువ్వు ఎలా ఓడిపోయావ్.. అని ఆశ్చర్యపోయారట. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటమిని ఎవరూ ఊహించలేదు కూడా. ఇందుకు రేవంత్ వివరణ ఇచ్చుకున్నారట.

Related image


టీఆర్‌ఎస్ ధనబలం, జనబలం.. ప్రత్యేకించి చివరి రోజుల్లో ప్రచారం పూర్తిస్థాయిలో చేయకపోవడం తన ఓటమికి దారి తీశాయని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారట. ఆ తర్వాత పార్టీని పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం చేసే చర్యలపై రాహుల్ చర్చించారట.

Image result for rahul and revanth


ఈ సమయంలో రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని పీసీపీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారట. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ యూపీతో పాటు తెలంగాణలోని ఖమ్మంలోనూ పోటీ చేయాలని నేతలు కోరారు. దీనిపై రాహుల్ తేల్చి చెప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: