వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అధికారం లోకి వస్తే ఏమేమి చేస్తానని పాదయాత్ర లో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే చాలా పథకాలు ను ప్రకటించాడు. అయితే ఇప్పడూ రైతులకు ప్రకటించిన పథకం చారిత్రాత్మకమని చెప్పాలి. ఇటువంటి పథకాన్ని ఎవరు ప్రకటించిన హర్షించాల్సిందే.  రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎప్పటికి వస్తుంది?  అసలు గిట్టుబాటు ధర విషయంపై ఏ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించదు?  రైతుల కష్టాల్ని తీర్చేందుకు సింఫుల్ ప్లాన్ ఎవరి దగ్గరైనా ఉందా? అంటే.. ఏ అధినేత.. ఏ పార్టీ మాట్లాడని పరిస్థితి.

Image result for jagan

ప్రపంచంలోని ప్రతి సమస్యపైనా స్పందించే పార్టీలు.. రైతుల గిట్టుబాటు ధర విషయంపై పెదవి విప్పరు. అలాంటిది తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న అన్నదాత దోపిడీకి చెక్ పెట్టేలా ఆయనో అద్భుతమైన పరిష్కారాన్ని చూపించారు.దళారులు ముఖ్యమంత్రులు అయితే రైతుల కష్టాలు తీరవని.. దళారుల కెప్టెన్లుగా మారిన చంద్రబాబు లాంటి నేతలతో రైతుల సమస్యలు పరిష్కారం కావన్న ఆయన. 

Image result for jagan

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. రైతు పంట వేయటానికి ముందే.. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు. పంట వేయటానికి ముందే.. తాను పండించే పంటకు వచ్చే ధర మీద అవగాహన ఉంటే.. అందుకు తగ్గట్లు రైతులు నిర్ణయం తీసుకునే వీలుంది. ఇప్పటివరకూ అస్పష్టత జగన్ చెప్పిన పరిష్కారంతో రైతుల సమస్యలు తీరుతాయని చెప్పాలి. జగన్ చెప్పిన ఈ మాట రానున్న రోజుల్లో మిగిలిన అన్నీ పార్టీల అధినేతలు తమ ఎజెండాలో చేర్చటం ఖాయమని చెప్పక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: