రాజకీయ ఎత్తులు పైఎత్తులలొ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఒకరిని ఒకరు మించిపోతున్నారు. ఎన్నికల్లొ నువ్వా నేనా అని డీ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. తిరుపతి సభతో సమర శంఖం పూరించిన జగన్ బాబుపై ఓ రేంజిలో  విరుచుకుపడ్డారు. అయిదేళ్ళలో ఎన్ని సినిమాలు చూపిస్తారంటూ ఫెయిర్ అయ్యారు.


పించన్లు మూడు వేలు :


ఇదిలా ఉండగా నిన్నటి వరకు వేయి రూపాయల పించన్లు మాత్రమే చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేల రెండు వేల రూపాయలను చేసింది. అది కూడా జగన్ నవరత్నాలలో ఇచ్చిన హామీలను కాపీ కొట్టి మరీ మేమే చేసామని చెప్పుకుంటోంది. దీనికి విరుగుడు అన్నట్లుగా జగన్ తిరుపతి సభలో పించన్లను మూడు వేల రూపాయలకు పెంచుతూ బాబుకు భారీ ఝలక్ ఇచ్చేసారు.  రెండు వేలకే మురిసిపోతున్న వృద్ధులకు జగన్ ఇపుడు తీపి కబురు అందించారు.


మరి జగన్ హామీలను మక్కీకి మక్కీ కాపీ కొడుతున్న చంద్రబాబు ఇపుడు మూడు వేల పెంపుపై ఎలా స్పందిస్తారో మరి.  ఇవాళ తోలి మీటింగ్ లోనే ఇలా జగన్ షాక్ తినిపించారు. ఇక బీసీల గర్జన ఉంది. ఇంకా అనేక సభలు కూడా ఉన్నాయి మరి అక్కడ కూడా జగన్ కొత్త హామీలు, వరాలు కురిపిస్తే బాబు ఎలా కౌంటర్లు వేసుకుంటూ వెళ్తారో చూడాలి మరి. ఇదిలా ఉండగా చాలాచోట్ల వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారు. 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఎల్లో మీడియా సాయంతో దొంగ సర్వేలు చేయిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు  అంటూ జగన్ బాబు మీద మండిపడ్డారు

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: