రకుల్ ప్రీతీ సింగ్ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలా సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను త్వరగానే అందుకున్నది. అయితే వరుసగా అమ్మడికి ఫ్లాప్స్ రావటంతో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు తెలుగు లో సైన్ చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. అయితే లేటెస్ట్ గా బాలయ్య సినిమా లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. బాలయ్య సినిమా లో హీరోయిన్స్ అంటే వారి కెరీర్ చివరి దశకు వచ్చిందని చెప్పాలి. 


రకుల్ చాలా దిగజారి పోయిందే ..!

రెండుసార్లు రకుల్ తో కలిసి పనిచేసిన బోయపాటి.. త్వరలో బాలయ్యతో చేయబోయే సినిమా కోసం రకుల్ ను అనుకుంటున్నాడట. స్టోరీ ఫైనలైజ్ అవ్వగానే కబురు పంపిస్తానని రకుల్ కు మాటిచ్చాడట. ఇక బాలయ్య విషయానికొస్తే ఏ హీరోయిన్ అయినా ఓకే. అసలే బాలయ్యకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో రకుల్ రూపంలో ఓ సినిమాకు హీరోయిన్ సమస్య తీరిపోయింది.


రకుల్ చాలా దిగజారి పోయిందే ..!

కాకపోతే బాలయ్య సరసన నటించిన తర్వాత క్లిక్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ. ఇక తప్పదు, బండి ఎలాగోలా లాగించాలనుకుంటేనే బాలయ్య సినిమా ఒప్పుకోవాలి. రకుల్ ఇప్పుడు అదే పనిచేసింది. బోయపాటి చలవతో ఎలాగోలా మరో ఛాన్స్ కొట్టేసింది. బాలయ్య సినిమా కంటే ముందు నాగచైతన్యతో వెంకీమామ సినిమా చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: