యుద్ధం అంటే నీతి ఉంటుందనుకోవడం పొరపాటు. గెలవడమే ప్రధానం అయిన వేళ ఏ రకమైన కుటిల నీతికైనా తెగించాల్సిందే. రాజకీయాలు అలాంటివే. ఇక్కడ మడి కట్టుకుని కూర్చున్న వారికి ఇబ్బందులు తప్పవు. అందువల్ల సమరానికి సిధ్ధపడినపుడు అన్ని వైపుల నుంచి దూసుకువస్తున్న కత్తులకు ఒకే మారు జవాబు చెప్పాల్సివుంటుంది. ఏమరుపాటుకు గురి అయితే భారీ మూల్యమే చెల్లించాల్సిఉంటుంది.


ఎల్లో మీడియాపైన :


అసలు యుధ్ధం బాబుతో కాదు ఎల్లో మీడియాతో. ఈ సంగతి ఇప్పటికి జగన్ కి బాగా తెలిసింది. 2014 ఎన్నికలో జగన్ని బదనాం చేసింది. ఇప్పటికీ చేస్తున్నది ఆ మీడియావే. నిజానికి లేని బలాన్ని చూపించి, ఉన్న బలాన్ని తగ్గించి నాడు అన్న గారి ముఖ్యమంత్రి కుర్చీని లాగేసింది కూడా ఇదే ఎల్లో మీడియావే కదా. నాటి నుంచి నేటి వరకూ కొత్త వ్యూహాలతో విస్తరిస్తోంది తప్ప ఏ మాత్రం తగ్గని, ఓడని మీడియా అది. జగన్ జనాన్నే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఆ జనాన్నే మాయలేడిలా ఎల్లో మీడియా మభ్యపెడుతోంది. ఇప్పటికి జగన్ కి విషయం అర్ధమైంది, కానీ విరుగుడు మంత్రం కూడా తెలియాలి. యుద్ధం చేయాలనుకున్నపుడు అన్ని తంత్రాలు దగ్గర పెట్టుకోవాలిగా.


జాగ్రత్త సుమా:


తిరుపతి సమర  శంఖారావ సభలో జగన్ మాటలు రాటుతేలిన ఆయన రాజకీయాన్ని తెలియచేశాయి. ఒకటికి పదిసార్లు దెబ్బ తిన్న ఆయన క్యాడర్ కి  దిశానిర్దేశం చేస్తున్న తీరు అదే చెబుతోంది. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు, ఎల్లో మీడియాతో కూడా ఉన్నది లేనట్లుగా , లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని జగన్ అన్న మాటలు అక్షర సత్యాలే. విషయం అర్ధమైంది కాబట్టి ఇక జగన్, పార్టీ మొత్తం ఎంత అలెర్ట్ గా  ఉంటే అంత వారికి మేలు. ఏ మాత్రం అజాగగ్రత్త పడినా ఇబ్బందులు తప్పవ్. ఇది జగన్ సమర నినాదం కాదు, అనుభవ సారమే.


మరింత సమాచారం తెలుసుకోండి: