జగన్ పెన్షన్ ను మూడు వేలకు పెంచుతామని ప్రకటించడం తో టీడీపీ కి ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ఇప్పుడు మూడు వేలు అని చెప్పి అందరూ జగన్ కు ఓటేస్తే పరిస్థితి ఏంటని టీడీపీ లో చర్చ మొదలైంది. పోనీ, మూడు వేల రూపాయలకు పెంచేస్తేనో.! అమ్మో కష్టమే. కానీ, పెంచాల్సిందే. లేకపోతే, జగన్‌ చెప్పిన 3 వేల పెన్షన్‌కి జనం ఎట్రాక్ట్‌ అయ్యే అవకాశముంది. అందుకే, మూడున్నర వేలకు పెన్షన్‌ని పెంచేద్దామా... పెంచుతామని చెబుదామా... చెబితే జనం నమ్ముతారా.? 4 వేల రూపాయలిస్తామని మేనిఫెస్టోలో పెట్టేస్తే ఎలా వుంటుంది.? 

Image result for jagan

 ఇదీ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ.. అధినేత చంద్రబాబు యెదుట పార్టీ ముఖ్య నేతలు చాలా ప్రతిపాదనలు పెడుతున్నారట.. ఎన్నికల సీజన్‌ కదా.. ఆ మాత్రం హంగామా తప్పదు మరి అధికార పార్టీలో.!  ప్రతిపక్షం కేవలం ఎన్నికల హామీ మాత్రమే ఇవ్వగలదు.. మనం, ఇచ్చేసి చూపించేయగలం.. ఇచ్చాక కూడా కాలం కలిసిరాక ఓడిపోవాల్సి వస్తే, ఆ పథకాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించలేదు గనుక.. బురద జల్లేయొచ్చన్నట్లుగా అధికార తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోందట. 

Image result for jagan

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'నవరత్నాలు' ప్రకటిస్తే, 'ఆ నవరత్నాలకు నిధులు ఎలా తెస్తారు.? సంపదని ఎలా సృష్టిస్తారు.?' అంటూ ఇదే ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఆయనే, పెన్షన్ల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌, పెన్షన్‌ని మూడు వేలకు పెంచుతానని చెప్పింది రాజకీయ ప్రకటనే కావొచ్చు.. చంద్రబాబు మీద పైచేయి సాధించడానికే కావొచ్చు.. కానీ, చంద్రబాబు మరోమారు వేలంపాటకు సిద్ధమవుతుండడమే నిజమైతే, అది క్షమించరాని నేరమే అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: