కామాతురాణాం నభయం.. న లజ్జ.. అంటారు. అంటే కామంతో కళ్లు మూసుకుపోతే భయం, లజ్జ ఉండవు.. కానీ ఇప్పుడు ఈ వాక్యానికి మరో అంసం అదనంగా కలపాలి. కామాతురాణాం న పాశం అని కూడా.. అంటే కామంతో కళ్లుమూసుకుపోతే కడుపుతీపి, పాశం కూడా ఉండవన్నమాట.

Image result for extra marital affair


అవును హర్యానా లోజరిగిన ఈ దారుణం గురించి వింటే మీరూ అవును అంటారు. తన అక్రమ సంబంధాన్ని కళ్లారా చూసిన పదేళ్ కూతురిని కర్కశంగా చంపేసిందో తల్లి. హర్యానాలోని కర్నాల్లో ఈ దారుణం జరిగింది.

Related image


కర్నాల్లో నివాసం ఉండే లక్ష్మి.. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోంది. భర్త, కూతురు బయటకు వెళ్లిన సమయంలో తన ఇంటికే ప్రియుడిని పిలిపించుకుని రాసలీలలు కొనసాగించింది. అయితే అనుకోకుండా పదేళ్ల కూతురు ఇంటికి వచ్చింది. తన తల్లి రాసలీలలు చూసింది.

Related image

అమ్మా.. ఇదేంపని.. నాన్నతో చెబుతానుండు అంది ఆ పాప ఆవేశంగా.. అంతే అదే ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. కూతురు కారణంగా తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన తల్లి లక్ష్మి..ఆ చిన్నారిని గొంతు పిసికి చంపేసింది. ఇందుకు ప్రియుడు కూడా సాయం చేశాడు. ఆ తర్వాత శవాన్ని దగ్గల్లో నదిలో పడేసింది. కానీ పోలీసుల విచారణలో అసలు సంగతి బయటపడింది. చివరకు కటకటాల వెనక్కు వెళ్లింది.


మరింత సమాచారం తెలుసుకోండి: