ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 13వ తారీఖున సమావేశాలు ముగుస్తున్న క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వినిపించాలని ఢిల్లీ వేదికగా భారీ దీక్ష చేయడానికి పూనుకొన్నారు.

Related image

విభజన నేపథ్యంలో ఆనాడు విభజన హామీల విషయంలో పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించిన నేపథ్యంలో ఈ నెల 11 వ తారీకున ఢిల్లీలో చేయబోయే దీక్ష కోసం ఇప్పటికే చంద్రబాబు ఏపీ మంత్రులతో సమావేశమయి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎలా తీసుకెళ్లాలని, ఉద్యోగులు, విద్యార్థులు అంతా కలిసి వెళ్లే విషయంపై చర్చిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Related image

ఆ సమావేశానికి మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఆనంద్‌బాబు, చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ… ఫిబ్రవరి 11వతేదీన చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.

Image result for chandrababu

ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి 13వతేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే దీక్షకు ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీక్ష తర్వాత 12న రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కలవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: