తెలుగుదేశంపార్టీలో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్ మొదలైంది. వచ్చే నెల 29వ తేదీతో రాష్ట్రంలోని ఎనిమిది ఎంఎల్సీ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఐదేమో ఎంఎల్ఏ కోటా లో భర్తీ అవ్వాల్సినవి. మిగిలిన మూడు స్ధానాల్లో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సినవి. ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయబోయే వాటిల్లో నాలుగు స్ధానాలు టిడిపికి మిగిలిన సీటు వైసిపి దక్కుతాయి కాబట్టి అందులో ఎటువంటి సమస్యా లేదు. సమస్యంతా టిడిపికి మిగిలిన మూడు స్ధానాల్లోనే.

 

పోయిన ఎన్నికల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. స్ధానిక ప్రజా ప్రతినిధుల కోటాలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కుట్రలు చేసి టిడిపి గెలిచింది. నిజానికి స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధుల కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎన్నికల్లో కూడా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసిపి గెలవాలి. కానీ ప్రజా ప్రతినిధులను లోబరుచుకుని, బెదిరించి తమకు ఓట్లేయించుకున్నారు టిడిపి నేతలు. అంటే ప్రలోభాలకు అవకాశం ఉన్న చోటేమో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులు గెలిచారు. అదే ఓటర్లు నేరుగా ఓట్లేసిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి బోల్తా పడింది.

 

అప్పటి ఎన్నికల తర్వత మళ్ళీ మార్చిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరగబోయేది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాజధాని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓటర్లు పాల్గొంటారు, ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరిగే ముందు ఎంఎల్సీ ఎన్నికలు జరగటమన్నది టిడిపికి ఇబ్బందిగా తయారైంది. రేపటి ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే దీని ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందన్నది టిడిపి నేతల ఆందోళన. పైగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని ఉపాధ్యాయులు, పట్టభద్రులు పాల్గొనే ఓటింగ్. కాబట్టే టిడిపిలో టెన్షన్ పెరిగిపోతోంది. మరి ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: