మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాన్ని గ్రహించినట్లున్నారు. ఒక్క తెలుగుదేశంపార్టీ మీద మాత్రమే పోటీ చేస్తే సరిపోదని చంద్రబాబు కొమ్ముకాస్తున్న పచ్చమీడియాపైన కూడా పోరాడాలని జగన్ తాజాగా చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై జనాల దృష్టి పడకుండా పచ్చమీడియా మ్యానేజ్ చేస్తున్న విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకవైపు చంద్రబాబుకు పూర్తి అండదండలు అందిస్తూనే మరోవైపు జగన్ పై ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నాయ్. జగన్ కు చంద్రబాబుకన్నా ప్రధాన శతృవు పచ్చమీడియానే.

 

పాదయాత్రలో కానీ అడపదడపాకానీ పచ్చమీడియాపై జగన్ ఆరోపణలు చేస్తునే ఉన్నారు. కానీ తిరుపతిలో మొదలైన సమర శంఖారావంలో పచ్చమీడియా పై ప్రత్యేకంగా మాట్లాడటం మాత్రం ఇదే ప్రధమం. చంద్రబాబుకు పచ్చమీడియా  ఏ విధంగా అండదండలందిస్తోందో వివరించారు. పచ్చమీడియాపై వైసిపి సోషల్ మీడియా విభాగం కావచ్చు, శ్రేణులు కావచ్చు లేదా బూత్ కమిటీ సభ్యులు,కన్వీనర్లు పచ్చమీడియాకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో తాను పోరాటం చేయాల్సింది పచ్చమీడియాపైనే అన్న విషయాన్ని జగన్ గ్రహించారని అర్ధమవుతోంది.

 

ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను, అసమర్ధతను కప్పి పుచ్చుతూ పచ్చమీడియాలో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ప్రచారాని వివరించారు. వైసిపిపై విషం చిమ్ముతున్న పచ్చమీడియా నైజాన్ని ఎండగడుతునే విషప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని, ఎదుర్కొనే విధానాన్ని కూడా జగన్ బహిరంగసభలోనే వివరించారు. అంతేకాకుండా గతానికి భిన్నంగా బహిరంగసభ అంటే వేదిక మీద నుండి మాట్లాడటమే కాకుండా వేదిక దిగివచ్చి పార్టీ శ్రేణుల మధ్యలో నిలబడి కూడా ప్రసంగించటం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పార్టీ శ్రేణులు ఎవరైనా పబ్లిక్ లేవనెత్తిన సమస్యలను, సందేహాలను నివృత్తి కూడా చేయటం కొత్త ప్రక్రియగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: