చంద్రబాబు నాటకాలు పరిది దాటుతున్నాయి. మహిళలకు తల్లి దండ్రులు చేయని సహాయం తాను చేశానని అన్నారు. పసుపు కుంకుమ పథకం క్రింద ₹10000/- చొప్పున రెండుసార్లు తాను తన యింటి ఆడ పడుచులకు ఇచ్చినట్లు ఇచ్చానన్నారు. ఒక అన్నగా తాను మాత్రేమే యిచ్చానన్నారు.

పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కడుపు మండుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రాకుండా చూసే బాధ్యత చెల్లెమ్మలదేనని చంద్రబాబు అన్నారు.

 
మహిళలకు అన్నగా అండగా ఉంటానని, పసుపు-కుంకుమ కింద డబ్బులు ఇచ్చానని చంద్రబాబు అన్నారు. అన్నగా అండ గా ఉండాలని, మనది రక్త సంబంధం కాకపోయినా పూర్వ జన్మ అనుబంధమని అన్నారు. అందుకే చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి  ₹ 20000  రెండు విడతలుగా పసుపు-కుంకుమ కింద ఇచ్చానని చెప్పారు. రైతులకు ₹24000 కోట్ల రుణ విముక్తి చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు


ఎవడబ్బ సొమ్ము ఆయన నేనిచ్చానన్నారు? అంటున్నారు ప్రజలు. ఆ సొమ్మంతా దేశంలో పన్ను గట్టేవారిది? ఈయన ఎవరు ఇవ్వటానికి? హెరిటెజ్ నుంచి తెచ్చి ఇచ్చారా? తన ఇంటి నుంచి తెచ్చిచ్చారా? ఎవరి సొమ్ము ఎవరిచ్చారు? 
stern opposition on TDP in AP కోసం చిత్ర ఫలితం
దేశంలో రెండంకెల అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏపి అని దేశంలో అంత అభివృద్ధి చెందిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. ఇది చాలు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అర్హత లేకుండా పోవటానికి. ఇంకా నరేంద్ర మోడీని ప్రతి మీటింగ్ లో పని గట్టుకొని తిట్టటం ఎందుకు? ప్రతిపక్షం శాసనసభలో లేనప్పుడు అభివృద్ది కార్యక్రమాలకు అడ్డెలా పడతారు? ఎన్నికల ముందు 


పేదరికంలేని సమాజం కోసం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మానవ వనరులు, సంక్షేమంపై శాసనసభలో ఆయన గురువారం మాట్లాడారు.

jagan images కోసం చిత్ర ఫలితం
తన కులం పేద కులమని, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవ డమే తెదేపా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజానికి పేదరికం శాపం వంటి దని చంద్రబాబు అన్నారు. ప్రపంచీ కరణతో కులవృత్తుల, చేతి వృత్తులు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కులవృత్తులు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అగ్ర వర్ణాల్లోనూ పేదలనున్నారని, మైనార్టీలూ పేదరికంలో మగ్గుతున్నారని వివరించారు. వారిని ఆదుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.  


ఈ మాటలు వింటున్న అగ్రవర్ణ పేదలు తమకు ఇన్నాళ్ళకు ఈ దేశం ఇచ్చిన రిజర్వేషణ్ అతి స్వల్పం. అందులో నుంచి సగం చంద్రబాబు తమ నోటివద్ద నుంచి గుంజుకొని రాజకీయ అధికారాన్ని నిలుపుకోవటానికి వేరే కులానికి ఇచ్చి - కులాల మద్య అగ్గి రాజేస్తున్నారని అగ్రవర్ణాల వారు శాపనార్ధాల తో తిట్టి పోస్తున్నారు. 
pawan kalyan images కోసం చిత్ర ఫలితం

కేంద్రం నుంచి భయానో నయానో బ్రతిమాలో బామాలో సాధించగల సమర్ధత ఉన్న నాయకుడని నమ్మి ప్రజలు ఓటేస్తే ఆ కేంద్రంతో గిల్లి కజ్జాలస్థాయి నుండి సమరం స్థాయికి తెచ్చి పెట్టటం జనం సహించేలా లేరు. అందుకే ఎన్నికల కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్నట్లు ప్రతి చోటా వినిపిస్తుంది ఒక్క టిడిపి బాబు మద్దతు మీడియాలో తప్ప. క్షేత్రస్థాయిలో ప్రజలిప్పుడు చంద్రబాబు పట్ల అయిష్టతను, అసహ్యాన్ని, ఏహ్యభావాన్ని వ్యక్త పరుస్తున్నారు. 


అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు టిడిపి తమ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పై కూడా అభివృద్ధి అందించని బిజెపితో సమానంగా వ్యతిరేఖత కనబరుస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బిజెపికి వ్యతిరేఖంలో సమాన దూరం ఉంచుతున్నారు. అలాగే అభివృద్ధిలో దేశంలో అన్నీ రాష్ట్రాలను అధిగమించిందని సిఎం చెపుతుంటే ప్రత్యేక హోదా ఇంకెందు కని ప్రశ్నించేవారి సంఖ్య కూదా కొద్ది కొద్దిగా పెరుగుతుంది. ఇవన్ని ప్రతిబింబించే కొత్త సర్వే వివరాలు చూడండి. 


వీడీపీ అసోసియేట్స్ సర్వే అంచనాల ప్రకారం:
 
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి ఊపునిచ్చేలా మరో సర్వే అంచనాలు బయటికొచ్చాయి. ఈసారి ఏపీలో వైసిపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వీడీపీ అసోసియేట్స్ సర్వే తేల్చేసింది. అధికార టీడీపీకి ఘోరపరాభం ఎదురు కాక తప్పదని అంచనా వేసింది. జనసేన సీట్లు సాధించకపోయినా.. టీడీపీ ఓటమిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయ పడింది.


వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని ఇండియా టుడే, టైమ్స్-నౌ సర్వేలు ఇప్పటికే తేల్చిన సంగతి తెలిసిందే.. తాజాగా వీడీపీ అసోసియేట్స్ సర్వే  (గతంలో తెలంగాణా శాసనసభలో వీరి సర్వే నిజమైంది) కూడా అదే తరహా ఫలితాలను వెల్లడించింది. వైసీపీ తిరుగులేని ఆధిఖ్యత సాధిస్తుందని స్పష్టం చేసింది. 


ఏపీలో మొత్తం 25లోక్-సభ నియోజకవర్గాలున్నాయి. వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం, వచ్చే ఎన్నికల్లో వాటిలో 21స్థానాలను వైసీపీ గెల్చుకుంటుంది. 45 శాతం ఓట్-షేర్ ను వైసిపి మాత్రమే పొందుతుందని చెప్పింది. టీడీపీ 37.20 శాతం ఓట్లతో కేవలం నాలుగు స్థానాలకే పరిమితమవుతుంది. 


జనసేన ఈ ఎన్నికల్లో ఓటర్ల పై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఈ సర్వే అంచనా వేసింది. 5.90 శాతం ఓట్లను జనసేన పార్టీ సాధిస్తుందని, అయితే ఒక్క పార్లమెంట్  స్థానాన్ని కూడా గెల్చుకోలేదని స్పష్టం చేసింది. టీడీపీ-జనసేన మధ్య కాపు ఓట్ల చీలిక జరుగుతుందని, తద్వారా వైసీపీ పరోక్షంగా లాభపడుతుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ 2.20 శాతం ఓట్లు సాధి స్తుందని, దాని కంటే మెరుగ్గా బీజేపీకి 7.13 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంటుందని వెల్లడించింది. 


లోక్-సభ ఎన్నికల సరళే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగితే టీడీపీ కేవలం 30శాసనసభ స్థానాలకు పరిమితమవుతుందని సర్వే అభిప్రాయపడింది. వైసీపీకి 130కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కర్ణాటక తమిళనాడు ఎన్నికల ఫలితాలను వీడీపీ అసోసియేట్స్ పక్కాగా అంచనా వేసిన సంగతి గమనార్హం. 

వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం, ఏపీలో వైసీపీ- 45 శాతం/ టీడీపీ- 37.2 శాతం/ బీజేపీ- 7.13 శాతం/  జనసేన  -  5.9 శాతం/  కాంగ్రెస్ -  2.20 శాతం/  సీపీఎం -  0.24 శాతం/ సీపీఐ -  0.2 శాతం/  ఇతరులు -  2.1శాతం/ ఓట్ల శాతం పొందుతారని నిష్కర్షగా చెప్పింది.  లోక్-సభ స్థానాలు — వైసీపీ -  21  టీడీపీ -  4 జనసేన  బీజేపీ - 0  కాంగ్రెస్ - 0  జనసేన - 0  స్వంతం చేసుకుంటా యని తన సర్వేలో ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: