ప్రభుత్వాలు స్వార్ధపరత్వం తో కుళ్ళి కృసిస్తున్నాయి. ప్రజలకంటే వారు ఎవరికి వారు బిజేపి ప్రభుత్వాన్ని త్రోసి రాజని ఒక మమత ఒక మాయ ఒక చంద్రబాబు ప్రధాని కావాలని కలలు కంటూ – ఎక్జెక్యూటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాజకీయ నాయకులతో మిలాఖత్ అయి ఉద్యోగం చేసే అధికారులకు ఎప్పటికైనా చెప్పుదెబ్బలు తప్పవు. ఘతం లో కాంగ్రెస్ హయాంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులు తమ వ్యక్తిగత పరువు ప్రతిష్టలు కోల్పోయి జైళ్ళ పాలైన విషయం మరువ కూడదు.  


అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇవ్వనుందా?  వారికి బహూకరించిన పతకాలను సైతం వెనక్కి తీసుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. సీబీఐ విచారణ పేరుతో కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందటూ మూడు రోజు ల పాటు సీఎం మమత బెనర్జీ కోల్‌కతా వేదికగా భారీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఆ ధర్నాలో పశ్చిమ బెంగాల్ డీజీపీ వీరేంద్ర తదితర ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
IPS officers participated in Mamata Dharna కోసం చిత్ర ఫలితం 
యూనీఫామ్‌ సర్వీసులలో సేవలు అందిస్తున్న అధికారులు ఒక రాజకీయ పార్టీ నిర్వహించే ధర్నాలో పాల్గొనడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మమత బెనర్జీ ధర్నాలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.  ఆ ఐపీఎస్ అధికారులకు బహుమతిగా ఇచ్చిన పతకాలను ఉపసంహరించుకోని కేంద్ర డిప్యూటేషన్ నుంచి కూడా వీరిని దూరం పెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
 five IPS officers participated in Mamata Benergi satyagraham కోసం చిత్ర ఫలితం
కాగా కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ అఖిల భారత సర్వీసు (ప్రవర్తనావళి) నిబంధనలు ఉల్లంఘించారనీ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్రం నుంచి తనకు ఎలాంటి అభ్యర్థన రాలేదంటూ సీఎం మమత బెనర్జీ తోసిపుచ్చారు. 
చిట్‌ఫండ్ స్కాం కేసుల్లో సిట్ బృందానికి సారథ్యం వహిస్తున్నసీపీ కీలక సాక్ష్యాధారాలు మాయం చేశారని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
five IPS officers participated in Mamata Benergi satyagraham కోసం చిత్ర ఫలితం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న యుద్ధంలో పోలీసులు నలిగిపోతున్నారు. తాజాగా శారదా స్కాంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐని రాష్ట్ర పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద రచ్చ అయింది. సీబీఐ, కేంద్రం తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో పోలీసు అధికారులు కూడా ఉండడం కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది.
five IPS officers participated in Mamata Benergi satyagraham కోసం చిత్ర ఫలితం
మమతా బెనర్జీ చేపట్టిన సత్యగ్రహ నిరసనలో పాల్గొన్న పోలీసు అధికారుల నుంచి మెడల్స్ వాపస్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఆయా అధికారులను సెంట్రల్ డిప్యుటేషన్ మీద కూడా తీసుకోకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. 


సెంట్రల్ గవర్న‌మెంట్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ చేపట్టే ధర్నాలో యూనిఫాం సర్వీసుల్లో ఉండే వారు పాల్గొనకూడదు. మమతా బెనర్జీ ధర్నా, రాష్ట్రంలో శాంతిభద్రతకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ఇచ్చిన నివేదికను బట్టి కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు ఐపీఎస్ అధికారులు మమతా బెనర్జీతో పాటు ధర్నాలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమై వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం.

వీరేంద్ర (1985 బ్యాచ్) పశ్చిమ బెంగాల్ డీజీపీ
వినీత్ కుమార్ గోయల్ (1994 బ్యాచ్) ఏడీజీ, డైరెక్టర్, సెక్యూరిటీ
అనుజ్ శర్మ (1991 బ్యాచ్) ఏడీజీ, శాంతిభద్రతలు
గ్యాన్వంత్ సింగ్ (1993 బ్యాచ్), బీదానగర్ సీపీ
సుప్రతిమ్ సర్కార్ (1997 బ్యాచ్), కమిషనర్

narendra modi on mamata కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: