ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ పార్టీ అధినేత జగన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తన ప్రత్యర్థి టిడిపి అధినేత చంద్రబాబు కు మతిపోయేలా అద్భుతమైన రాజకీయాన్ని ప్రదర్శిస్తూ వ్యూహాలు వేస్తూ ప్రజల మన్నలను పొందుతూ టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టేలా రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.

Image may contain: 2 people, crowd and outdoor

ఇప్పటికే రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి వైసీపీ పార్టీ పై ప్రజలకు నమ్మకాన్ని కలిగించి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో రావలసిన హామీల విషయంలో తన స్వార్ధ రాజకీయం కోసం చంద్రబాబు ఏ విధంగా కేంద్ర పెద్దలతో చేతులు కలిపి గత నాలుగు సంవత్సరాలు ఆడిన డ్రామా లను పాదయాత్రలో ఎండగట్టిన జగన్ తాజాగా పాదయాత్ర ముగించాక భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు.

Image may contain: 9 people, people smiling, crowd and outdoor

ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సిపి జగన్‌ కడపలో జరిగిన సమర శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని అన్నారు. అంతేకాక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు.

Image may contain: one or more people, crowd and outdoor

ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానిక రూ.15 వేలు సాయం అందిస్తామన్నారు. ప్రతి మే నెలలో రైతులకు రూ. 12,500 ఇస్తామని తెలిపారు.చంద్రబాబు ప్రజలకు మూడు సినిమాలు చూపించారని విమర్శించారు



మరింత సమాచారం తెలుసుకోండి: