ఇటీవల నాగబాబు.. నా ఛానల్ నా ఇష్టం పేరుతో పొలిటికల్ సెటైర్లు విసురుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల ఏబీఎన్ చానల్లో వచ్చిన ఓ వీడియోను ప్లే చేస్తూ చేసిన రన్నింగ్ కామెంటరీ కలకలం సృష్టించింది. ఏకంగా ఓ పత్రికాధిపతిపై అలాంటి సాహసం చేయడం ఆశ్చర్యం కలిగించింది.

Image result for nagababu vs rk


అయితే ఈ వీడియో బాగా వైరల్ కావడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఫాస్ట్ గానే రియాక్టయ్యారు. మా కంటెంట్‌ ను ప్లే చేసినందుకు మీపై చర్య తీసుకుంటాం.. మీ యూట్యూబ్ ఛానల్ కు కాపీరైట్ స్ట్రయిక్ ఇస్తామని వార్నింగ్ మెయిల్ పంపారు. దీంతో నాగబాబు ఆ వీడియో డిలిట్ చేయక తప్పలేదు.

Image result for nagababu official twitter


వెంటనే ఆ వీడియోను డెలిట్ చేసినా నాగబాబు ఆగ్రహం మాత్రం చల్లారినట్టు లేదు. అందుకే మళ్లీ ఓ వీడియో పోస్ట్ చేశారు. మీరు మీ వీడియోను ప్లే చేయకుండా ఆపారు. కానీ నా ఎక్స్‌ప్రెషన్‌ను ఆపలేరు కదా.. అంటూ మళ్లీ ఏబీఎన్ రాధాకృష్ణపై మళ్లీ విమర్శల దాడి మొదలుపెట్టారు.

Image result for nagababu


దీంతో ఈ నాగబాబు- ఆర్కే సోషల్ వార్ పీక్ కు చేరింది. విశేషం ఏమిటంటే.. ఈ వీడియోను కూడా నాగబాబు ఆ తర్వాత డెలిట్ చేశారు. ఇది నెటిజన్లకు ఆశ్చర్యం కలిగించింది. బహుశా.. ఏబీఎన్ ఆర్కే నుంచి ఎలాంటి సందేశం వచ్చిందో.. మరి ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదిరిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు లభించడం లేదు. దీనిపై నాగబాబు క్లారిటీ ఇస్తే బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: