కేసీయార్ రెండవమారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ఆయన జాతీయ రాజకీయాల్లో బాగా చర్చకు వస్తున్నారు. బంపర్ మెజారిటీతో మరో మారు సీఎం అయిన కేసీయార్ రేపటి ఎంపీ  ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగిస్తారని సర్వేలు ఘొషిస్తున్న వేళ జాతీయ రాజకీయ తెరపై ఆయన పాత్ర ఆసక్తికరంగా మారింది. దాంతో పాటీ కేసీయార్ ప్రాధన్యత అంతకంతకూ పెరిగిపోతోంది.


14న విశాఖకు కేసీయార్:


గత ఏడాది డిసెంబర్లో విశాఖకు వచ్చిన కేసీయర్ మరో మారు నగరానికి రానున్నారు. ఈ నెల 14న ఆయన నగరంలోకి శారదాపీఠానికి వస్తున్నారు. ఆయనతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అదిత్యనాధ్ యోగి కూడా పీఠానికి రావడం విశేషం. ఈ ఇద్దరూ ఆ రోజు పీఠంలోజరిగే  మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.  ఇక విశాఖ టూర్ తరువాత కేసీయర్ తరువాత ప్రొగ్రాం ఏంటన్నది ఇంకా తెలియకపోయినా ఏపీ రాజకీయాలు అపుడే  వేడెక్కుతున్నాయి.


జగన్ ఇంటికేనా:


ఇక అదే రోజు అమరావతిలో జగన్ కొత్త ఇంట్లోకి గ్రుహప్రవేశం చేస్తున్నారు. ఆయన ఇంటికి అతిధిగా కేసీయార్ వెళ్తారన్నది చాలాకాలంగా వినిపిస్తున్న సంగతే. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేటీయార్ జగన్ తో చర్చించారు. ఇపుడు కేసీయార్ నేరుగా జగన్ ఇంటికి వెళ్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో హీట్ చెప్పలేనంతగా ఉంటుంది. తాను చంద్రబాబు గురించి చెప్పాల్సినవి ఏపీ వచ్చే చెబుతానని గతంలో కేసీయార్ అన్న మాటలు గుర్తు చేస్తుకుంటే ఆయన ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.



మొత్తానికి ఓ వైపు ఎన్నికలు తరుముకువస్తున్నాయి. ఇంకోవైపు వైసీపీ దూకుడు రాజకీయం చెస్తోంది. దానికి  కేసీయర్ లాంటి అగ్ని తోడు అయితే ఇక ఏపీలో ఆ వేడి వడగాలులను తలపించేదే అంటున్నారు. మొత్తానికి కేసీయార్ ఓ సంచనలం అనుకుంటే ఆయన టూర్లు ఏపీలో ఇంకా  సెన్సేషన్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: