అసలు ఏ సిద్ధాంతం ప్రాతిపదికన కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పడింది? సిద్ధాంత ప్రాతిపధికలేని ఏ సంకీర్ణమైనా పతనం దిశగా పయనించవలసిందే. దేశ మాజీ ప్రధాని హెచ్ డి దేవే గౌడ కుమారుడు ముఖ్యమంత్రి కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్‌ ఏర్పడి ఎంతోకాలం కాలేదు. కాని ఈ నిర్భంద బందుత్వం నిలిచేదెంత కాలమో తెలియదు గాని దీని ప్రయాణం మాత్రం పతనం వైపుకే ననిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
devegowda kumara Sivakumar కోసం చిత్ర ఫలితం
శాసనసభకు హాజరుగాని శాసనసభ్యుల సంఖ్య ఒక్క రోజులో 20కి పెరగడంతో ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందేమో నన్న కలకలం ఆ రెండు పార్టీల్లో నెలకొన్నాయి. ఒక జేడీఎస్‌ శాసన సభ్యునితో సహా 11 మంది శాసనసభ్యులు ముంబై లో విడిది వేసినట్లు తెలిసింది. ఇదే అదనుగా ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకునే దిశలో కుమారస్వామి నేటి (శుక్రవారం) మధ్యాహ్నం ప్రవేశ పెట్టాల్సిన రాష్ట్ర బడ్జెట్‌ ను అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. 
karnataka jds-congress coalition doubt కోసం చిత్ర ఫలితం
గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, 11మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదని ఫిర్యాదు చేయనుంది. గవర్నర్‌ గనుక జోక్యం చేసుకుంటే బడ్జెట్‌ సమావేశాలు ఆగిపోతాయేమొనన్న ఆందోళన కూడా సంకీర్ణ ప్రభుత్వం కలకలం సృహ్టిస్తుంది.  కొద్దిరోజుల క్రితం  అత్యవసరంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ శాసన సభా పక్ష (సీఎల్పీ) సమావేశానికి గైర్హాజరైన నలుగురు శాసనసభ్యులు రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమతహళ్లి, బి.నాగేంద్ర, ఉమేశ్‌ జాదవ్‌ ఇప్పటివరకు జాడ లేకుండా పోయారు. విప్‌ జారీ చేసినా శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే (బుధవారం) 9 మంది శాసనసభ్యులు  హాజరు కాలేదు. నిన్న గురువారం శాసనసభ వారి సంఖ్య 20 కి దాటడంతో కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రాయి పడింది. 
karnataka jds-congress coalition doubt కోసం చిత్ర ఫలితం
శుక్రవారం సిఎం కుమారస్వామి శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై చర్చ జరిగి ఓటింగ్‌ కు బీజేపీ పట్టుబడితే. 20మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు ఐతే మాత్రం ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా రెండోరోజు కూడా సభను ఉక్కిరిబిక్కిరి చేసి స్తంభింప చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉన్న వారు నలుగురేనని, వారిపై అనర్హత వేటు వేస్తామని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత సిద్దరామయ్య హెచ్చరించారు.
karnataka jds-congress coalition doubt కోసం చిత్ర ఫలితం
సీనియర్ బిజెపి నాయకుడు కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్-చార్జ్ పి మురళీధరరావు ఇప్పటికే ఈ సంకీర్ణం మనలేదని (కాంట్ సర్వైవ్) అని గత జనవరిలోనే చెప్పారు. అది కూడా వారి అంతర్గత శత్రుత్వంతోనే కూలిపోతుందని అన్నారు. వారి బలహీనతలైన స్వార్ధం, స్వయంకృతాపరాధం బిజేపికి బలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
rahul priyanka cbn mamata కోసం చిత్ర ఫలితం
ఈ సంకీరణం గనుక వైఫల్యం చెందితే బిజేపి ఏతర కాంగ్రెస్, టిఎంసి తదితర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లో ధారుణమైన దెబ్బ తగిలేది తధ్యం అంటున్నారు. ఏపి సిఎం, టిడిపి అధినేత, నారా చంద్రబాబు నాయుడు ముచ్చటగా చెప్పుకొనే  కర్ణాటకలో బిజేపి ఏతర ప్రభుత్వం ఏర్పడటానికి నేనే కారణం అనె మాట ఇక శాశ్వతంగా వినిపించదు, కాంగ్రెస్ అధినేతలు రాహుల్ ప్రియాంక లకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతకు కూడా ఇది షాకేనని బిజేపి వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు "ప్రియాంక గాంధి యాక్టివ్ రాజకీయాల్లోకి అడుగెట్టింది ఇంకేం అంటారు" ఖచ్చితంగా  బిజేపి వాదులు. మరి నిజమేగా? అంటున్నారు కర్ణాటక వాసులు. 
 rahul priyanka cbn mamata కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: