తమిళనాడులో దశాబ్దాల క్రితమే సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ముడిపడిపోయింది. ఇక ఏపీలోనూ నాలుగు దశాబ్దాలుగా అదే సాగుతోంది. ఇక్కడ కూడ తెర వేలుపులే ఇల వేలుపులుగా ఉంటున్నారు. ఇక ఇలవేలుపులు తెర బొమ్మలవుతున్నారు. రెండు రంగాలు ప్రజల అభిమానం చూరగొన్నవే. ఎక్కడ రాణించాలన్నా జనాభిమానం తప్పనిసరి.


యాత్ర సూపర్ హిట్ :


ఎటువంటి హైప్ లేకుండా షూటింగ్ జరుపుకుని కూల్ గా ధియేటర్లలోకి వచ్చిన యాత్ర మూవీ మంచి హిట్ అయింది. వైఎస్సార్ అంటూ జనం సినిమా చూస్తూ మమేకం అవుతున్నారంటే మహానేత గుండెల్లో  ఎంతలా ఉన్నారో అర్ధమవుతోంది. ఆయన చనిపోయిన‌ పదేళ్ళు అయిన తరువాత కూడా జనం ప్రేమ తగ్గలేదని ఈ విధంగా మరో మారు తెలుస్తోంది. ఇక యాత్ర మూవీ విషయానికి వస్తే మమ్ముట్టి అచ్చం వైఎస్సార్ ని అచ్చుగు ద్దేశారు. హావభావాలు కూడా అలాగే పలికించారు. ఇక ఈ సినిమాను అయితే వైఎస్ ఫ్యామిలీ ఎపుడూ ఓన్ చేసుకోలేదు. జగన్ సైతం ఈ మూవీ ఊసే ఎత్తలేదు. కానీ రిలీజ్ తరువాత వైఎస్సార్ తెర ముందుకు అలా వచ్చేసి జనం గుండె తలుపు ఇలా తట్టేశారు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో.


ఎన్నికల్లో లాభమా :


నిజానికి రాజకీయ పార్టీలకు ఏ పరిణామాన్ని  అయినా తమకు అనుకూలంగా చేసుకోవడం అలవాటు. అందుకే అన్న గారి బయోపిక్ తీసి టీడీపీ ఎన్నికల కోసం వాడుకోవాలనుకున్నారు. అయితే సంక్రాంతికి వచ్చిన ఆ మూవీ చతికిలపడింది కానీ యాత్ర మాత్రం సైలెంట్ గా వచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ రెండు మూవీలకు సంబంధించి ఏపీలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీల జాతకం ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. మరి ఈ మూవీ విషయానికి వస్తే యాత్ర హిట్ అయింది. మరి రేపటి ఎన్నికల్లో వైసీపీ కూడా హిట్ కొడుతుందా అన్నది చూడాలి. అభిమానులైతే  కాబోయే సీఎం జగన్ అంటున్నారు. ఆ తీర్పు రావాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: