వై.ఎస్. జగన్‌.. ఏపీలో బలమైన ప్రతిపక్షనేత. ఆయనకు ఉన్న బలాల్లో ముఖ్యమైంది తండ్రి వారసత్వం.. వైఎస్ చరిష్మా.. కానీ వై.ఎస్. మరణించి దాదాపు 9 ఏళ్ల పూర్తవుతున్న సమయంలో.. ఆయన చరిష్మా ఇంకా పనిచేస్తుందా.. అందుకే వైఎస్ వ్యూహాత్మకంగా యాత్ర సినిమా ద్వారా వైఎస్ గొప్పదనాన్ని మరోసారి ఆవిష్కరించారేమో అనిపిస్తోంది.



యాత్ర సినిమాకూ వైసీపీకీ సంబంధం లేదని దర్శకుడు చెబుతూ వస్తున్నా.. ఆ సినిమా రూపొందించిన తీరు.. చివరిలో జగన్ ప్రసంగం ఇది వైసీపీ సినిమాయే అనిపించకమానవు. కానీ సినిమా ఓ పార్టీ సినిమాగా కాకుండా వైఎస్ గొప్పదనాన్ని ఘనంగా ఆవిష్కరించింది. సినిమాకు మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది.



ఈ సినిమా ద్వారా మరోసారి వైఎస్ గొప్పదనం కళ్ల ముందు మెదులుతోంది. దీని వల్ల వైఎస్ ద్వారా లబ్దిపొందిన కుటుంబాలు తప్పకుండా వైసీపీకే మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో అడుగడుగునా కాంగ్రెస్ తీరును ఎండగట్టడం జరిగింది.



వైఎస్ మాత్రం పార్టీలోనే ధిక్కార స్వరం వినిపిస్తూ విధేయుడుగా ఉన్నారు. జగన్ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్‌ ను ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకున్నారు. యాత్ర సినిమా ద్వారా వైఎస్ వారసత్వాన్ని ప్రజలకు గుర్తు చేయడంతో పాటు కాంగ్రెస్ పాత్రను ఎండగట్టడం ద్వారా జగన్ రెండు పిట్టలను ఒకే దెబ్బకు కొట్టినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: