ఒకసారి వదిలేసింది మళ్ళీ వస్తుందా.. కాళ్ళ దగ్గరకు వచ్చింది కాశీకి వెళ్ళినా దక్కదన్న సామెత ఉంది ఇపుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం అలాగే ఉంది. హోదా కోసం పార్టీల మధ్య కుస్తీ ఏపీ ఎల్లలను దాటి వెళ్ళడంలేదు. మరో వైపు హోదా వీరుడు బిరుదు కోసం పోరాటం మాత్రం బ్రహ్మాండంగా సాగుతోంది.


బాబుకు వస్తుందా :


హోదా గురించి గత ఏడాది గా మాత్రమే టీడీపీ పెద్ద గొంతు చేసుకుంటోంది. అంతకుముందు ఆ పార్టీ హోదాని నాలుగేళ్ళుగా మూలన పెట్టింది. అయితే బీజేపీ హోదా ఇవ్వలేదని ఇపుడు ధర్మ పోరాట దీక్షలంటూ జనంలోకి వస్తోంది. ఏపీలో దీక్షలు పూర్తి అయ్యాయి, ఇక హస్తినలో దీక్షలు అంటున్నారు. నిజానికి ఏపీలో దీక్షలు డిల్లీదీక్షలు, నిరాహార వ్రతాలు ఇవ్వన్నీ వైఎస్ జగన్ ఎపుడో చేసేశారు. నాడు వాటిని పక్కన పెట్టింది కూడా టీడీపీనే. ఇపుడు హోదా మంత్రం జపిస్తున్న టీడీపీకి ఆ మైలేజ్ వస్తుందా..


పది కోట్ల దీక్ష :


ఇక డిల్లీ  దీక్షకు చంద్రబాబు సర్కార్ అచ్చంగా పది కోట్ల రూపాయలను ఖర్చు  చేస్తోంది. ఇది నిజంగా  దారుణమే. ప్రభుత్వం ఖర్చుతో దీక్షలు చేయడం, దానికి పేద వాని పన్ను సొమ్ముని దుబారాగా వాడుకోవడం. ఇంతకీ హోదా ఎక్కడ ఉందన్నది కూడా ఎవరికీ అర్ధం కాని స్థితి. ఇది పూర్తిగా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నదని ఇప్పటికే జనాలు అర్ధం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ ఫీట్లు, పాట్లు జనం కరెక్ట్ గానే అర్ధం చేసుకుంటున్నారు. 
అయినా పుణ్య కాలం దాటేసాక హోదా ఇపుడు తెస్తామన్నా ఎవరు నమ్ముతారన్న మాట కూడా వినిపిస్తోంది. ఫుల్ మెజార్టీతో ఉన్న బీజేపీ, దానితో దోస్తీ చేసిన టీడీపీ కలసి నాలుగేళ్లలో హోదాను తీసుకురాలేనిది  రేపు కలగూర గంప ప్రభుత్వాలు వస్తే ఇస్తాయా అన్నది ఎవరిని అడిగినా లేదని, రాదని  ఇట్టే  చెప్పేస్తారు. ఏది ఏమైనా హోదా పేరుతో   డిల్లీ దీక్ష  మరో  ఎన్నికల జిమ్మిక్కు అంటున్నాయి విపక్షాలు 



మరింత సమాచారం తెలుసుకోండి: