అసెంబ్లీ చివరి రోజుల్లో టీడీపీ సర్కారు ఘోర అవమానం ఎదుర్కొంది. బీసీల సబ్ ప్లాన్ బిల్లు విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక బీసీ మంత్రి నీళ్లు నమిలారు. ఇదేం బిల్లు.. ఇదెక్కడి చోద్యం అంటూ సభ్యుడు కడిగిపారేస్తుంటే మంత్రిగారు నోరెళ్లబెట్టేశారు.

Image result for kuna ravikumar


చివరకు ఆ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బిల్లును అప్పటికప్పడు మార్పులు చేర్పులు చేయించి హడావిడిగా ఆమోదించేశారు. మరి ఇంతకీ ఆ ప్రశ్నలు అడిగింది ఎవరు.. సభలో వైసీపీ ఎమ్మెల్యేలే లేరుగా అనుకుంటున్నారా.. అలా అడిగింది సాక్షాత్తూ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్.

Image result for achennayudu in assembly


స్పష్టత లేకుండా సబ్‌ప్లాన్‌ బిల్లు ఉందని, అసలు అంకెలే లేవని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కామెంట్ చేయడం ఇంకో విశేషం. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తామని మంత్రి అచ్చెన్న చెప్పడంతో 50 శాతం నిధులు సబ్‌ప్లాన్‌కు కేటాయించాలి, అదే విషయం చట్టంలో చేర్చాలని రవికుమార్‌ పట్టుబట్టారు. మరో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఇతరులు ఉన్నచోట ఖర్చుపెట్టే విషయంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయంటూ అసమగ్రంగా బిల్లుపెడితే ఎలా అని ప్రశ్నించారు.



నిజాలను నిర్భయంగా నిలదీసిన కూన రవికుమార్ కు అధినేత చంద్రబాబు నుంచి అక్షింతలు పడ్డాయట.. అదేంటి.. మన పార్టీ పెట్టిన బిల్లునే తప్పుబడతావా.. పార్టీ పరువు తీస్తావా అంటూ చంద్రబాబు రంకెలేశారట. దీనికితోడు ఈ వ్యవహారంపై సాక్షి పత్రిక బ్యానర్ కథనం ప్రచురించడంతో మరోసారి పిలిపించి..ఇలాంటి పనులు మరోసారి చేయొద్దని వార్నింగ్ ఇచ్చారట అధినాయకుడు.. అదీసంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: