ఫస్ట్రేషన్ ఒకరిదైతే, ఫన్ మరొకరిది. అంటే ఒకరు ఏడుస్తూంటే మరొకరు నవ్వుతారన్నమాట. ఇది ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుది, ఎలా వస్తుంది. ఒకరికి ఫస్ట్రేషన్ ఉందని ఇంకోరికి ఎలా తెలుస్తుంది. అక్కడే ఉంది తమాషా మరి.


మోడీకి ఫ్రస్ట్రేషన్ :


ఏపీకి వస్తున్న ప్రధాని మోడీకి ఫ్రస్ట్రేషన్ ట.. ఆయన చాలా వత్తిడిలో ఉన్నారట. అందువల్ల ఆయన ఏదేదో మాట్లాడుతారట. ఈ రోజు టెలీ కాంఫరెన్స్ లో  పార్టీ నాయకులతో చెబుతూ చంద్రబాబు అన్న మాటలివి. నిజమే అధికారంలో ఉన్నారు మోడీ. అయిదేళ్ల పాటు అనుభవించారు. మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సర్వేలు చూస్తే వ్యతిరేకంగా ఉన్నాయి. మరోసారి ప్రధాని పీఠం దక్కుతుందో లేదో అని మోడీకి ఫ్రస్ట్రేషన్ ఉండడం సహజమే.


మరి బాబుకో :


మరి అదే ఫ్రస్ట్రేషన్ చంద్రబాబుకు కూడా ఉండదా. ఎందుకంటే ఈయన కూడా అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. చాలా హామీలు నెరవేర్చలేదు. సర్వేలు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఎన్నికల వేళ మరో మారు పీఠం దక్కుతుందా అన్న బెంగ ఉండనే ఉంది. దాంతో బాబుకి కూడా ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. మరి ఈ ఇద్దరి  ఏలికల ఫ్రస్ట్రేషన్ భరించాల్సిన బాధ మాత్రం అచ్చంగా ప్రజలదే. మోడీ బాబు నిన్న జోడీ. నేడు కూడా జోడీనే. అదే ఫ్రస్ట్రేషన్ జోడీ. అంతేగా...అంతేగా..



మరింత సమాచారం తెలుసుకోండి: